వీటిపై అవగాహన పెంచుకున్నాకే.. పెళ్లి చేసుకుంటే బెటరట తెలుసా?

praveen
పెళ్లి అనేది కేవలం రెండు అక్షరాల పదమే. కానీ ఈ రెండక్షరాల పదమే రెండు జీవితాలను ముదిపెడుతూ ఉంటుంది. ఇక 100 సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు కలిసి ఉంటాం అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒంటరిగా ఏకాకిలా సాగిపోతున్న జీవితానికి ఒక తోడు నీడను ఇస్తూ ఉంటుంది పెళ్లి అనే బంధం. ఇక ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. తమను అర్థం చేసుకునే భాగస్వామి జీవితంలోకి రావాలని యువతీ యువకులు ఇద్దరు కూడా ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే పెళ్లి అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. మోయలేనని కుటుంబ బాధ్యతలు కూడా పెళ్లి అనే బంధంలో ఉంటాయి అని చెప్పాలి.

 అయితే పెళ్లి తర్వాత కొత్త వ్యక్తితో జీవితం సాగించడం.. అంత సులభమైన విషయమేమీ కాదు. ఇద్దరి మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి గొడవలు తరువాతే భార్యాభర్తలిద్దరూ ఒకరిని ఒకరు మరింత బాగా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం పెళ్లి తర్వాత జరిగే చిన్న చిన్న గొడవలను పెద్దదిగా చేసుకుంటూ చివరికి పెళ్లిని పెటాకులుగా మార్చుకుని విడాకులు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే పెళ్లికి ముందు అబ్బాయిలు కొన్ని విషయాలను నేర్చుకోవాలట.

 పెళ్లికి ముందు అబ్బాయిలు ఎక్కువగా ఫ్రెండ్స్, కొలీగ్స్ తో తిరుగుతుంటారు. కొందరైతే ఉదయాన్నే క్రికెట్ గ్రౌండ్ కు వెళ్తారు  సాయంత్రం ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టడానికి వెళ్తారు. వీలైతే రాత్రి వరకు పెగ్ వేస్తారు. ఇంట్లో వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తారు. అయితే పెళ్లి తర్వాత ఇవన్నీ మార్చుకోవాలి. జీవిత భాగస్వామితో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే కొత్త ఇంట్లో అడుగుపెట్టిన వధువు భర్తతో కలిసినట్లుగా అత్తమామలతో కలవలేదు. కాబట్టి అబ్బాయి ఇక నీకు నేను ఉన్నాను అనే భరోసా కల్పించేందుకు ఆమెతో సమయం గడపాలి. అయితే పెళ్లి తర్వాత  తినే తిండి దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా భాగస్వామికి షేర్ ఉంటుంది. అందుకే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకుండా భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసిన వారు పెళ్లి తర్వాత అలా చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇక ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకున్న తర్వాతే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: