ఇలా చేస్తే.. నీ జీవితానికి నువ్వే హీరో?

తమకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకొని వాటిని చేరి జీవితంలో విజయవంతం అయిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.  మిగతా వారు అక్కడే ఆగిపోయి తమ జీవితం ఇంతే అంటూ నిస్తేజ పడుతుంటారు. అయితే గెలిచిన వారికి ఓడిన వారికి తేడా ఏంటంటే ఆత్మ విశ్వాసం.  ఆత్మ విశ్వాసం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. చాలామంది నేను ఈ పని చేయలేను. నావల్ల కాదు అని వారిని వారు చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు.

మనకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. అది కొందరికీ మాత్రమే రాసిపెట్టి ఉంటుంది అని రకరకాలుగా భావిస్తుంటారు.  గెలిచిన వారిలో మనం గమనించినట్లయితే కొన్ని గొప్ప లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి.  అందులో ఒకటి కన్ సిస్టెన్సీ అంటే వారు అనుకున్నది సాధించే వరకు పోరాడుతూనే ఉంటారు.  దాని మీదే పూర్తి ఫోకస్ పెడుతూ ఉంటారు.

రెండోది స్మార్ట్ వర్క్. మన పెద్దలు జీవితంలో బాగా కష్టపడాలి అని చెబుతుంటారు.  కానీ ఇప్పుడు స్మార్ట్ వర్కే కీలకం. దీనివల్ల సమయం ఆదా అవుతుంది.  మూడోది టైం టేబుల్. మనం ఎంత స్మార్ట్ వర్క్ చేసినా.. పక్కా ప్రణాళిక లేకుండా చేస్తే అది నిరుపయోగమే అవుతుంది. నాలుగోది ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్ అంటే సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాలి. ప్రారంభంలో తమ లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుంటారు. క్రమేణా దీని నుంచి డీవియేట్ అయి పక్కదారి పడుతుంటారు.

ఎప్పుడు అయితే మన మైండ్ లో నెగిటివ్ ఆలోచనలు వస్తాయో అవి మనల్ని పతనావస్తకు పడేస్తాయి. ఐదోది అన్నింటి కన్నా ముఖ్యమైనది.. ఇతరులతో పోల్చు కోవద్దు. అంటే ఒకరి రోల్ మోడల్ (ఆదర్శంగా)  తీసుకోవాలి. కానీ పక్కవారితో పోల్చుకోకూడదు. ఏ ఇద్దరి జీవితాలు ఒకేలా ఉండవు. ఎవరి జీవితం వారికే గొప్ప. ఏస్థాయి వ్యక్తులకు ఉండే సమస్యలు వారికి ఉంటాయి. ఉదా వ్యాపారస్తుడికి లాభాలు వస్తాయో రావో అనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది.  ఎవరూ నీ జీవితాన్ని మార్చలేరు. నీ జీవితానికి నీవే హీరో. నీవే దానిని అద్భుతంగా తీర్చిదిద్దుకో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: