ఈ ఐదు తప్పులు చేశారంటే ఊబకాయం కాయం..!

Divya
ఈ మధ్యకాలంలో అధిక బరువు,ఉబకాయం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందికి వస్తూ ఉంది. వీటికి కారణం మనకున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు వల్ల,ఉబకాయం వస్తూ ఉంది.దీనివల్ల గుండె సమస్యలు,ఊపిరితిత్తుల సమస్యలు,మూత్రపిండాల సమస్యలు అంటూ రకరకాల అనారోగ్య సమస్యలు మన చుట్టూముడుతూ ఉంటాయి.కానీ ఈ ఉబకాయాన్ని మనం చేసే ఐదు రకాల తప్పులు వల్లే కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.అసలు ఆ ఐదు తప్పులు ఏంటో మనము తెలుసుకుందాం పదండి..
రాత్రి భోజనం..
చాలామంది రాత్రి భోజనాన్ని లేటుగా తింటూ ఉంటారు సాధారణంగా మన జీర్ణశక్తి పగటి సమయంలో ఎక్కువగాను,రాత్రి సమయంలో తక్కువగాను ఉంటుంది.అటువంటి దానివల్ల రాత్రి భోజనం లేటుగా చేయడంతో,రాత్రి సమయంలో జీర్ణం అవడం లేట్ అవుతుంది.దీనివల్ల శరీరంలో కొవ్వులు పేరుకుపోయి, ఉబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ రాత్రి 8 గంటల లోపే భోజనం చేయడానికి ట్రై చేయాలి.
జంక్ ఫుడ్ తినడం..
జంక్ ఫుడ్ లలో ఉప్పు,కారాలు,మసాలాలు తప్ప ఎలాంటి పోషకాలు ఉండవు.అందువల్ల ఇందులో ఉన్న అధిక కొవ్వులు బాడీ చుట్టూ పేరుకుపోయి,ఉబకాయం వస్తూ ఉంటుంది.పిల్లలు వీటి బారినపడి రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు.వీటన్నిటిపై పిల్లల తల్లిదండ్రుల అవగాహన తెచ్చుకొని,వారికి పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వడం చాలా ఉత్తమం.
కార్బోహైడ్రేట్స్ అధికంగా తినడం..
కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఇడ్లీ,దోశ,ఉప్మా,అన్నం వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబకాయానికి దారితీస్తూ ఉన్నాయి.సాధారణంగా కార్బోహైడ్రేట్స్ మోతాదులో తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. కానీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల, కార్బోహైడ్రేట్స్ కొవ్వు వల్ల రూపంలో శరీరంలో పేర్కొపోయిని ఉబకాయాన్ని కలిగిస్తాయి.కావున వీటికి బదులుగా,న్యూట్రియన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం.

ఆస్తమానం తినడం..
చాలామంది ఇళ్లలో నోట్లో ఏదో ఒకటి తింటూనే ఉంటారు.కనీసం అరగంట సేపైనా నోటికి రెస్ట్ ఇవ్వరు. ఇలా చేయడం వల్ల అదనపు కొవ్వులు మన శరీరంలో చేరుకుపోయి,ఉబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వ్యాయామాలు చేయకపోవడం..
చాలామంది బద్ధకించి వ్యాయామాలకు దూరంగా ఉంటారు.దీనివల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.వ్యాయామాలు చేయడం వల్ల శరీరం యాక్టివ్ గా ఉండి,పోషకాలను ఈజీగా గ్రహిస్తుంది.దీనితో ఉబకాయం బారిన పడకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: