ఈ టిప్స్ పాటించండి? కీళ్ళ నొప్పులని తరిమేయండి?

Purushottham Vinay
అసలు ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏదొక సమయంలో ఏదో ఒక నొప్పితో బాధ పడుతున్నారు. ఆ నొప్పుల నుండి ఉపశమనం కోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.అయితే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలా కాకుండా కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ నొప్పులను తగ్గించటానికి ఆవనూనె, ముద్ద కర్పూరం అనేవి మంచి దివ్య ఔషదాలుగా చెప్పవచ్చు. ఆవనూనెలో ముద్ద కర్పూరం కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సాఫ్ట్ గా మసాజ్ చేసి వేడి నీటితో కాపడం పెట్టాలి. ఈ విధంగా చేస్తే కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,మెడ ఇంకా నడుము నొప్పి అన్ని రకాల నొప్పులు తగ్గిపోతాయి.కర్పూరం నొప్పి,వాపుకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.



ఇక ఆవ నూనెలో చాలా సమృద్ధిగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కీళ్ళనొప్పులతో సంబంధం ఉన్న కీళ్ల దృడత్వం ఇంకా నొప్పిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి.శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశంలో రక్తప్రసరణను పెంచి నొప్పి నుండి ఉపశమనం కలిగేలా ఈ నూనె చేస్తుంది. ఇక నొప్పులు రాగానే మందుల షాప్ కి పరిగెత్తవలసిన అవసరం లేదు. ఇలా ఇంటి చిట్కాలు ఫాలో అయితే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. చాలా తక్కువ ఖర్చులో నొప్పుల నుండి సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఒక్కసారి ఈ నూనెను తయారుచేసుకుంటే చాలా రోజుల దాకా మనం,వాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన అద్భుతమైన ఇంటి చిట్కాలని పాటించండి. ఖచ్చితంగా కీళ్ళ నొప్పుల సమస్యలు చాలా ఈజీగా తగ్గిపోతాయి. మళ్ళీ ఇక రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: