చంద్రగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి స్త్రీకి గర్భం ధరించడం అనేది చాలా గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు.అలాంటి స్త్రీలు కొన్ని కొన్ని రోజులలో తప్పనిసరిగా సరైన నియమాలను పాటించి,జాగ్రత్తలు పాటించక పొతే మాత్రం చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు.అవి ఏంటంటే చంద్రగ్రహణం మరియు సూర్యగ్రహణం ఉన్న ప్రదేశాలలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలని వారికి సూచిస్తున్నారు.మీలో ఎవరైనా గర్భంతో ఉన్నా లేదంటే,మీ చుట్టుపక్కల ఎవరైనా గర్భంతో ఉన్నవారికి కచ్చితంగా ఈ నియమాలు తప్పకుండా ఉపయోగపడతాయి.అవేంటో చూద్దాం పదండి.

గర్భంతో ఉన్న ప్రతి స్త్రీ ఈనెల అంటే అక్టోబర్ 28వ తారీకు చంద్రగ్రహణం మొదలవుతుంది.కావున ఈరోజు కచ్చితంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి.ఎందుకంటే చంద్రుడు నుంచి వచ్చే లేజర్ కిరణాలు గర్భంపై పడి లోపల ఉన్న శిశువుకు రకాల దోషాలు కలుగుతాయి.  అందువలన ఈ స్త్రీలు కచ్చితంగా జాగ్రత్త పాటించాలి.

అందులో ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఎలాంటి పనులు వున్నా వాయిదా వేసుకోవడం,కత్తి,సూది వంటి షార్ప్ గా ఉన్న వస్తువులకు దూరంగా ఉండడం వంటివి కచ్చితంగా చేయాలి.మరియు చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి గర్భిణీ స్త్రీలో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు.ఒకవేళ మందులు వేసుకోవాలి అనుకుంటే,మనం తినే ఆహార పదార్థాలలో దర్భ అనే వస్తువుని ఉంచి ఆ తర్వాత తీసుకోవడం చాలా ఉత్తమం.ఇలా చేయడంతో చంద్రగ్రహణం వల్ల కలిగే కీడు ఆ దర్భ నుంచి బయటకు వెళ్ళిపోతుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు.ఇంకా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు కంప్లీట్ గా రెస్ట్ లో ఉండడం చాలా ఉత్తమం.మరియు ఇంట్లోకి ఎలాంటి కిరణాలు లోపలికి రాకుండా తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచాలి.

ఇలా చంద్రుని గ్రహణం వీడేంత వరకు ఉండి, చంద్రగ్రహణం తర్వాత,తలార తలస్నానం చేసి,ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడికి దీపం సమర్పించుకున్న తర్వాత ఆహార పదార్థాలను వండుకొని తినడం ఉత్తమం.కావున మీరు కానీ,మీ చుట్టూ ఉన్న  ఎవరైనా కడుపుతో ఉంటే ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించి, సరైన బిడ్డకు జన్మనివ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: