పెంగ్విన్ల మరణం.. మనిషికి భారీ హెచ్చరిక?
అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పర్వతాల ప్రాంతాల్లో అధిక వేడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వేడి ప్రాంతాల్లో చల్లటి ఉష్ణోగ్రతలు రావడం ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే భిన్నమైన వాతావరణం కలిగిన ఇండియాలో సమ శీతోష్ణ ప్రాంతాలు, అత్యంత వేడి ప్రాంతాలు, చల్లటి ప్రదేశాలు ఉండటం తెలిసిన విషయమే. కానీ ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా విభిన్న వాతావరణం కారణంగానే పెంగ్విన్ లు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
రాబోయే రోజుల్లో పెంగ్విన్ ల జాతి అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఒకే సారి పది వేల పెంగ్విన్ లు మరణించడం వెనక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండాలి. లేదా పెంగ్విన్ లను బలమైన వ్యాధి రావాలి. కానీ ఒకే సారి మూకుమ్మడిగా ఇలా మరణించడం అనేది ఎంతో ఇబ్బందికరమైన విషయం.
దీన్ని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే శాస్త్రవేత్తలు గమనించాలి. ఎందుకిలా జరిగిందో తెలుసుకుని రాబోయే రోజుల్లో వాతావరణంలో మార్పులు ఎలా తీసుకురావాలి. మార్పులతో ఏమేం చేయొచ్చు. తదితర విషయాలను ప్రపంచానికి తెలియజేయాలి. తద్వారా వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. లేకపోతే నేడు పెంగ్విన్ లు మరణించినట్లే రేపు మరో జాతి.. ఆ తర్వాత అది చివరకు మనిషి ప్రాణాల వరకు వస్తుంది. పర్యావరణాన్ని రక్షిస్తేనే రేపటి మానవ మనుగడ సాధ్యమని తెలుసుకోవాలి.