టూరిజం ట్రిప్ వేద్దామనుకుంటున్నారా? కాస్త ఆగండి?
టూరిజం ఏజెన్సీలు ప్యాకేజీలు ఏర్పాటు చేస్తాయి. అయితే కేంద్రం వారిపై జీఎస్టీ 20 శాతం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం టూర్ ప్యాకేజీలు గతంలో కేవలం అయిదు శాతం ట్యాక్స్ మాత్రమే కట్టేవారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, వియత్నాం, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, గల్ప్ దేశాల్లో పర్యటించాలనుకునే వారికి టూర్ ఆపరేటర్లు ఏర్పాట్లు చేస్తుంటారు.
ప్రస్తుతం టూర్ ప్యాకేజీ కింద అయిదు శాతం ట్యాక్స్ చెల్లిస్తుంటే అక్టోబర్ 1 వ తేదీ నుంచి అది 20 శాతానికి పెరగనుంది. వైద్యం, విద్య అవసరాలకు ఆయా దేశాలకు వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. కొవిడ్ తగ్గిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పన్ను భారం కూడా అదనంగా పెరిగిపోయింది. ఒక కుటుంబం గతంలో టూర్ వెళ్లాలనుకుంటే గతంలో రూ. 5 లక్షలు అయితే ఇప్పుడు అదనంగా టీసీఎస్ రూపంలో మరో లక్ష చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విదేశాలకు సొంతంగా వెళితే మాత్రం ఈ టీసీఎస్ ప్రభావం ఉండదు. కాబట్టి విదేశాల్లో ప్రయాణించాలనుకునే వారు.. ఈ టీసీఎస్ ప్రభావం తగ్గించుకునేందుకు ఆయా ఏజెన్సీలు, టికెట్ కన్సల్టింగ్ లను సంప్రదిస్తున్నారు. విదేశాల్లో హోటల్ గదులు, ఇతర సదుపాయాలను సొంతంగా బుక్ చేసుకుంటే ఈ టీసీఎస్ భారం తప్పే అవకాశం ఉంది. మరి విదేశీ ప్రయాణికుల టూర్ లపై విధిస్తున్న ఛార్జీలతో ప్రయాణాలు ఏమైనా తగ్గే అవకాశం ఉందో చూడాలి.