పళ్ళ సమస్యలని ఈజీగా పోగొట్టే హోమ్ టిప్స్?

Purushottham Vinay
మనలో చాలా మంది కూడా పళ్ళ నొప్పులతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఈ పళ్ళ నొప్పుల వల్ల విపరీతమైన బాధ కలుగుతుంది. ముఖ్యంగా మనం ఆహారాన్ని నమిలి తినే సమయంలో ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఒక్కోసారి పళ్ళ నొప్పుల వల్ల మనం ఆహారాన్ని కూడా సరిగ్గా తినలేక పోతూ ఉంటాము.ఈ పళ్ళ నొప్పుల కారణంగా నోటి దుర్వాసన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.అందువల్ల మనకు తరచూ జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. అలాగే పళ్ళ చుట్టూ ఉబ్బినట్టుగా కూడా ఉంటుంది. మన దంతాల లోపల ఉండే సున్నితమైన నరాలు ఇన్ఫెక్షన్ కు గురి అయినప్పుడు ఈ సమస్య అనేది ఎక్కువగా తలెత్తుతుంది.ఇంకా అలాగే దంతాల నొప్పులు రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి.పళ్ళని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, దంతక్షయం, చిగుళ్లు ఆరోగ్యంగా లేకపోవడం, పొగాకు వంటి వాటిని ఎక్కువగా నమలడం వంటి కారణాల వల్ల కూడా దంతాల నొప్పులు వస్తూ ఉంటాయి. కారణాలేవైనా కానీ దంతాల నొప్పులను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య ఖచ్చితంగా మరింత తీవ్రమయ్యి దంతాలు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ల వల్ల వచ్చే దంతాల నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.


ఇంకా అదే విధంగా ఇతరత్రా కారణాల వల్ల వచ్చే దంతాల నొప్పులను మాత్రం మనం కొన్ని రకాల హోమ్ టిప్స్ వాడి ఈజీగా నయం చేసుకోవచ్చు.పళ్ళ నొప్పులను తగ్గించడంలో కొబ్బరి చెట్టు వేర్లు చాలా బాగా సహాయపడతాయి. ఈ కొబ్బరి చెట్టు వేర్లను నీటిలో వేసి బాగా మరిగించాలి.ఆ తరువాత ఈ నీటిని నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు, దంతాల సున్నితత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. దంతాల నొప్పులను తగ్గించడంలో లవంగాల నూనె కూడా చాలా సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో యాంటీ మైక్రోబయాల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దంతాల నొప్పులతో బాధపడే వారు ఒక కప్పు నీటిలో లవంగం నూనెను వేసి కలిపి నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి.ఇక ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే లవంగాలను పేస్ట్ గా చేసి నొప్పి ఉన్న దంతాలపై నేరుగా రాయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: