మానసిక ప్రశాంతత కోసం మల్లెపూల టీ..!

Divya
వేసవి కాలంలో మల్లెపూలు ఎక్కువగా పూస్తాయి. వాటిని స్త్రీలు అలంకరించుకున్నప్పుడు వాటి సువాసన ఇంటి నిండా వెదజల్లుతూ ఉంటుంది.అ వాసనకే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఈ పూల అలంకరించుకోవడమే కాక,టీ చేసుకుని తాగడం వల్ల కూడా మనసుకు చాలా ప్రశాంతత కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.కావున ఆందోళన,గుండెదడ,నీరసం వంటి వాటితో బాధపడేవారికి మల్లెపూల టీ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.అంతేకాక మల్లెపూల టీ వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
మల్లెపూల టీ చేసే విధానం..
మల్లెపూలను కోసి బాగా ఎండబెట్టి, ప్రాసెస్ చేసిన తర్వాత వాడుకోవాలి. వీటిని గాలి తగలనీ గాజు సీసాలో భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా  అలాగే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.ఒక గిన్నెలో గ్లాస్ నీళ్ళు పోసి, అందులో రెండు స్ఫూన్ల చక్కెర, ఒక స్ఫూన్ ప్రాసెస్ చేసిన మల్లెపూలు, ఒక స్ఫూన్ టీ పౌడర్, రెండు యాలకులు, చిన్న దాల్చినచెక్క వేసి, బాగా మరిగించి వడకట్టుకొని తాగాలి.
ఉపయోగాలు..
ఇందులోని ఎల్ -థియానైన్ మానసిక ఒత్తిడి మరియు ఆందోళన నుంచి ఉపశమనం కలిగించి,మానసిక ప్రశాంతత కలిగిస్తుంది.దీనిని తరచూ తీసుకోవడం వలన ఏకాగ్రత పెరిగి,జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.అంతేకాక ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే దగ్గు,జలుబుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలాంటి ఫ్లేవర్లు గల టీలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి,మోకాల నొప్పులు,ఆర్థరైటిస్ వంటివి తొందరగా తగ్గించుకోవచ్చు. మరియు ఇది జీర్ణక్రియ రేటును పెంచి, మలబద్ధకం,అజీర్తి,విరోచనాలు వంటివి తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.అంతే కాకుండా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడి సెల్యూలార్ ఎనర్జీని పెంచుతాయి. దీనివల్ల దీర్ఘకాలికంగా వచ్చే క్యాన్సర్,గుండె జబ్బులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరు ఈసారి టీ తాగేటప్పుడు ఒక స్పూన్ ప్రాసెస్ చేసిన మల్లెపూలు వేసుకొని తాగడం అలవాటు చేసుకొని,మానసిక ప్రశాంతతను వెంటనే పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: