భవిష్యత్తులో డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఈ పనులు చెయ్యాల్సిందే..

Divya
ఇప్పుడున్న ఆహార అలవాట్లు, తగిన శారీరక శ్రమ లేకపోవడం, జీవన విధానం వల్ల, చాలామంది డయాబెటిస్ కి గురవుతున్నారు. వీటివల్ల మన శరీరంలో అధిక గ్లూకోజ్ విడుదలై రక్తంలో కలవడం వల్ల   ఇంటికొక మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మన శరీరంలో అధిక గ్లూకోజ్ విడుదల కాకుండా ఉంటుంది. దీనివల్ల మన శరీరంలో మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాంటి మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
 అధిక చక్కెరలు తినకపోవడం..
మన శరీరానికి కావాల్సిన చక్కెరలు మన తినే పండ్లు కూరగాయల నుండి అందుతాయి.కానీ మనం కాఫీ, టీ,తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల,అధిక షుగర్స్ మన రక్తంలోకి తొందరగా కలిసిపోయి డయాబెటిస్ కి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున తీపి పదార్థాలను అధికంగా తీసుకోకపోవడం ఉత్తమం.
తగిన నిద్ర..
పని ఒత్తిడి, డిప్రెషన్,ఆలోచనలు వల్ల చాలామంది సరిగా నిద్రపోరు. దీనితో మన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి, మధుమేహానికి దారితీస్తాయి.కావున ప్రతి ఒక్కరూ కనీసం 8 గంటలు నిద్రపోవాలి.
 తగిన ఆహారం తీసుకోకపోవడం..
మన శరీర తత్వం బట్టి ఆహార నియమాలను పాటించాలి.తొందరగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకుని, ఆయిల్ మరియు మసాలా ఆహారాలను దూరంగా ఉంచడం వల్ల, మన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ సక్రమంగా ఉంటాయి.
తగిన వ్యాయామాలు చేయడం..
ప్రతి ఒక్కరూ కనీసం అరగంట సేపు నడక కానీ,వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి. దీనితో మన హార్మోనల్ గ్రందులు ఇన్సులిన్ తగిన మొత్తదులో విడుదల చేస్తాయి.అంతే కాక వ్యాయామం వల్ల మన శరీరం ఇన్సుల్లిన్ ను సక్రమంగా ఉపయోగించుకుంటుంది.
ఆల్కహాల్, పొగ వంటి వాటికీ దూరంగా ఉండటం..
పొగత్రాగడం, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్లు కారణంగా మన రక్తంలోకి అధిక గ్లూకోజ్ విడుదల అయి,మధుమేహానికి దారి తీయవచ్చు. కనుక చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల,ఇదే కాక చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: