రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే టిప్స్?

Purushottham Vinay
పలు అలవాట్ల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్ల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకుగాను, పరిశుభ్రమైన జీవనశైలిని పాటించడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్య సమస్యల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోవాలి.రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన వారిలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. గ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి ఎంతో ముఖ్యమైనదని పదేపదే చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించాలంటున్నారు నిపుణులు. పుట్టగొడుగులు, బ్రొకోలి, దానిమ్మ, బీన్స్‌, చిక్కుడు గింజలు, బచ్చలి కూర నిత్యం ప్లేట్‌లో ఉండేలా చూసుకోవాలి.


కూరగాయలు,పండ్లు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, చేపలను అధికంగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ఉన్న మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబున్నాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌తో మరణించే ప్రమాదంపై ప్రత్యక్ష ప్రభావం చూపకుండా గుండె జబ్బులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. చాలా మంది మహిళలు, వృద్ధ మహిళలు, అలాగే ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్‌ ఉన్నవాళ్లు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, మంచి పోషకాలున్న ఆహారాలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఆరోగ్యకరమైన బరువు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ గుండె ఆరోగ్యానికి, ఎముక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి డైట్ కంట్రోల్‌తోపాటు యోగా, వ్యాయామం వంటివి అలవర్చుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ప్రతి రోజు వ్యాయామం చేస్తుండటం వల్ల వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. కనీసం వారానికి 150 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయాలంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఏరోబిక్‌ వ్యాయామం (వాకింగ్‌ వంటివి), రెసిస్టెన్స్‌ వ్యాయమాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. వ్యాయామం చేయడం వల్ల చురుకుగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: