రాత్రిపూట తినకూడని ఆహారాలు?

Purushottham Vinay
చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది.రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. అయితే రాత్రి భోజనంలో తినకూడని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. ఎంత ఆరోగ్యానికి ప్రయోజనమైనా రాత్రి సమయంలో పలు రకాల ఆహారపదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రాత్రికి సరైన ఆహారం కాదు. రాత్రంతా మెదడు చురుగ్గా ఉండేందుకు ఈ పెరుగు సరిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది.సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయ. కానీ రాత్రిపూట గాఢ నిద్రకు ఆటంకాలు కలిగించే కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిది.రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదు. ఈ సూపర్ ఫుడ్ రాత్రి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.



రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోవడం లేదా ఉదయం ఎసిడిటీకి కారణమవుతుంది.బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలిసిందే. అయితే డిన్నర్‌లో బ్రకోలీని ఎప్పుడూ తినకూడదు. బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే రాత్రి పూట ఎలాంటి సమస్య లేకపోయినా ఉదయం నిద్ర లేవగానే గ్యాస్, ఎసిడిటీ సమస్య రావచ్చు.రాజ్మాలో ఐరన్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సీ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాజ్మాను రాత్రి సమయంలో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగిస్తుంది. అంతే కాకుండా కడుపులో గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలను మాత్రం రాత్రి అస్సలు తినకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: