లైఫ్ స్టైల్: వంకాయలను వీరు అసలు తినకూడదట..!

Divya
సాధారణంగా మన వంటింట్లో దొరికే కూరగాయలలో వంకాయ కూరగాయ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.  ముఖ్యంగా వంకాయ కూరను ఇష్టపడి తినేవారు చాలా ఎక్కువమంది ఉన్నారు.  మరీ ముఖ్యంగా చెప్పాలంటే వంకాయలతో చేసే గుత్తి వంకాయ కూర అంటే లొట్టలు వేసుకుంటూ మరీ పుష్టిగా లాగించేస్తూ ఉంటారు.  అందుకే వంకాయ ప్రతి వారి ఫేవరెట్ కూరగాయ అని చెప్పవచ్చు.  ఇకపోతే కొంతమంది మాత్రం వంకాయ తింటే అలర్జీలు , నవ్వలు పెడతాయని కూడా చెబుతూ ఉంటారు. వంకాయ వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  కానీ వంకాయను కేవలం కొంతమంది మాత్రమే తినాలని లేకపోతే కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయి.
మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వంకాయ కూరను తినకూడదు అనే విషయాన్నికొస్తే ముఖ్యంగా అరుగుదల తక్కువగా ఉండేవారు వంకాయ కూర తినకూడదు. అలాంటి వారికి గ్యాస్ సమస్యలు మరింత ఎక్కువవుతాయి . ఇక అలాగే ఎలర్జీ ఉన్నవారు కూడా వంకాయని తినకూడదు. ఇలా తింటే దద్దుర్లు,  దురద మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇక అలాగే డిహైడ్రేషన్ తో  బాధపడే వారు కూడా వంకాయలను తినకుండా ఉండడమే మంచిది. ఇక డీ హైడ్రేషన్ తో  పాటు ఇతర ఆందోళన సమస్యలతో బాధపడే వారు కూడా వంకాయను తినకూడదు. రక్తహీనత సమస్యతో ఉన్నవారు కూడా వంకాయలు తింటే మరింత సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
అంతేకాదు కళ్ళల్లో మంట, వాపు, దురద వంటి సమస్యలు ఉన్నవారు కూడా వంకాయ కు దూరంగా ఉండాలి.  అలాగే ఫైల్స్ సమస్యతో బాధపడేవారు వంకాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అంతేకాదు మరిన్ని సమస్యలతో లేదా ఏదైనా ఇతర చర్మ గాయాలతో బాధపడే వారు కూడా వంకాయకు దూరంగా ఉండాలి. ఇక ఇలాంటి సమస్యలు ఉన్నవారు అసలు వంకాయ తినకూడదు.  ఒకవేళ తింటే పరిస్థితిని మరింత విషయం చేసుకున్నవారు అవుతారు.  కాబట్టి ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుల సలహాతో వంకాయ కూర తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: