లైఫ్ స్టైల్: సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఇలా చేయండి..!

Divya
ప్రస్తుతం వాతావరణంలో పలు రకాల మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో చాలామంది తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఒకసారి వర్షాలు ఎక్కువైతే మరొకసారి ఎండలు తీవ్రంగా బాధిస్తున్నాయి.. మరొకవైపు ఈదురు గాలులతో పిల్లల పెద్దలు సైతం సీజనల్ వ్యాధులకు గురి అవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో తరచూ వచ్చే వ్యాధులను దూరం చేసుకోవాలి అంటే ఉల్లి చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
సహజంగా ఉల్లి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్ళను బలపరుస్తుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో మనకు ఉల్లిలో కూడా కొన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. జలుబు, దగ్గు, కఫం వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఉల్లిపాయలు మనకు యాంటీ అలర్జీ , యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ కార్సినోజనిక్ వంటి లక్షణాలు ఉండటం వల్ల శరీరానికి వచ్చే సీజనల్ వ్యాధులను అడ్డుకుంటాయి. ఇకపోతే ఉల్లిపాయల ఉండే లక్షణాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. ఇక ఉల్లి రసం ద్వారా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
జలుబును దూరం చేసుకోవాలి అంటే ఉల్లిపాయ, నిమ్మరసం రెండింటిని ఒక పాత్రలో తీసుకొని కలిపి అందులో తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకుంటే కొన్ని గంటల వ్యవధిలోనే తేడాను గమనించవచ్చు. ఇక జలుబు సమస్య నుంచి ఉల్లిపాయ సిరప్ కూడా మీకు బాగా సహాయపడుతుంది. ఒక పాత్రలో ఉల్లిపాయ రసాన్ని తీసుకొని రెండు చెంచాల తేనె వేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. అనంతరం ఈ సిరప్ ను జలుబు బాధితులకు ఇవ్వడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఉల్లిపాయతో ఆవిరి పెట్టడం వల్ల కూడా జలుబు, ముక్కు కారడం , ఫ్లూ  వంటి సమస్యలు దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: