"లవ్ బ్రేక్ అప్" లు ఎక్కువగా ఎవరు చెబుతారో తెలుసా?
అమ్మాయి వలన తన అలవాట్లు, పద్దతులు, ప్రేమ వలన అబ్బాయి భవిష్యత్తు అందంగా, సురక్షితంగా కనిపించలేదు అని అనిపించినపుడు అతడు అమ్మాయికి బ్రేకప్ చెప్పే అవకాశం ఉంది.
అదే విధంగా అమ్మాయి తన వైఖరితో అబ్బాయి స్వేచ్ఛకు అడ్డుగా నిలబడితే కూడా అబ్బాయిలు బ్రేకప్ చెప్పేస్తున్నారట.
మొదట్లో అంతా ఓకే అనిపించినా... పోను పోను అమ్మాయి ప్రేమ తగ్గిన, తరచూ విసుక్కున్నా, వ్యక్తిత్వం, నడవడిక, మాటతీరు మారినా కూడా అబ్బాయి ఇక ఆ ప్రేమకు గుడ్ బాయ్ అనేస్తున్నాడట. అమ్మాయి ప్రతి దానికి అబ్బాయిని అనుమానిస్తూ, నమ్మకం లేకుండా చూస్తున్నా కూడా అబ్బాయిలు సహనం కోల్పోయి నీ ప్రేమకు ఇక వీడ్కోలు అంటున్నారట.
అయితే నేటి ప్రేమ జంటల్లో నిలబడేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా పైన తెలిపిన కారణాలు అయి ఉంటాయి.
తరచూ గొడవ పడుతూ,గొడవ పడినప్పుడల్ల అబ్బాయే బ్రతిమలాడాలి,ముందుగా మాట్లాడాలి అని ప్రతిసారీ చేసిన కూడా ఇక బ్రేకప్పే.....
ఇలాంటి కారణాల వలన ఎక్కువుగా అబ్బాయిలు తమ ప్రేమకు బ్రేకప్ చెబుతున్నారట. అందుకే ప్రేమించే మరియు ప్రేమించబడే ప్రతి ఒక్కరు మీ మీ లవ్ పార్టనర్ లను అర్ధం చేసుకుని ఆ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లగలగాలి.