లైఫ్ స్టైల్: ఉప్పు అధికంగా తింటున్నారా? అయితే మీ ఆయుష్షు తగ్గినట్టే..!!

Divya
సాధారణంగా ఆహారానికి రుచి పెంచడానికి ఉప్పును మనం ఉపయోగిస్తాము. కానీ మోతాదుకు మించి ఆ ఉప్పును ఉపయోగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడమే కాకుండా మన ఆయుష్షు కూడా తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఎన్ని చెప్పినా సరే చాలామందికి అధికంగా ఉప్పు తినకపోతే వారికి ఏదైనా సరే తిన్నట్టు అనిపించదు. అలాంటివారు సాధారణ స్థాయి కంటే అధికంగా ఉప్పును జోడించి మరి తింటూ ఉంటారు . ఇక అలాంటి వారిపై ఇటీవల అధ్యయనం జరపగా విస్తుపోయే నిజాలు బయట పడ్డట్లు సమాచారం తాజాగా యూరోపియన్ హార్ట్ జనరల్ ప్రకారం.. 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఉప్పు తీసుకుంటే స్త్రీల యొక్క జీవితకాలం 1.5 సంవత్సరాలు పురుషుల యొక్క జీవితకాలం 2.2 సంవత్సరాల తగ్గుతుందని రుజువైంది.
ముఖ్యంగా కాల్షియం, సోడియం,  బ్రో మైడ్ , మెగ్నీషియం వంటి పోషకాలు ఉప్పులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కానీ అధికంగా ఉపయోగించడం వల్ల హానికరం అని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే మీరు కూరలలో ఎక్కువ ఉప్పు జోడించడం వల్ల అధిక ఉప్పు తీసుకుంటున్నట్లు అర్థం కాదు.. కానీ మార్కెట్ నుంచి తెచ్చిన చిప్స్, టాకోస్ , నమ్ కిన్స్,  పిజ్జా వంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటివల్ల శరీరంలో ఉప్పు అధికంగా పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇక సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. ఇక ఉప్పు అధికంగా తినడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి.
గుండెపోటు అధికం అవుతుంది. అలాగే బీపీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకపై మీరు ఉప్పు అధికంగా తినాలని ఆలోచనలో ఉన్నట్లయితే వెంటనే ఉపశమించుకోవడం మంచిది. లేకపోతే 100 సంవత్సరాలు జీవించాల్సిన మీరు అతి తక్కువ వయసులోని మరణించే ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: