లైఫ్ స్టైల్: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా..?

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్మాయిలు 20 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఇక దీని కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా నెలసరి ఆగిపోవడం , శరీర బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలిపోవడం, శరీరంలో పలుమార్పులు చోటు చేసుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక థైరాయిడ్ అనేది మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వ్యాధి అని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఇకపోతే థైరాయిడ్ తో బాధపడుతున్న వ్యక్తి త్వరగా దాని లక్షణాలను చూపించడం ప్రారంభిస్తారు. ఇక ఈ వ్యాధి లక్షణాలను తక్షణమే గుర్తించి వెంటనే చికిత్స చేయడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. లేకపోతే మరెన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి థైరాయిడ్ తో బాధపడుతున్న వారు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. ముఖ్యంగా మీ ఆహారంలో కొబ్బరినూనెను తీసుకోవడం తప్పనిసరి. ఇది బరువును నియంత్రించి జీవక్రియ రేటును పెంచుతుంది. అలాగే మీరు కూరగాయలు వండడానికి కొబ్బరి నూనెను ఉపయోగించి, వంటకం తయారు చేయవచ్చు. ఇక కొబ్బరి నూనెతో తయారుచేసిన వంటలను తినడం,  తరచూ కాళ్లకు , చేతులకు కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
థైరాయిడ్ రోగులు తమ ఆహారంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక ప్రతిరోజు ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి ఉదయాన్నే తాగడం వల్ల మరింత ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. పాలలో.. పసుపు కలుపుకొని ప్రతిరోజు తాగడం వల్ల థైరాయిడ్ నియంత్రణలోకి వస్తుందని ఒక అధ్యయనం ద్వారా తేలింది. ఇక చేపలు,  గుడ్లు తీసుకోవడం వల్ల థైరాయిడ్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక వెంటనే ఆహారంపై శ్రద్ధ వహించి థైరాయిడ్ సమస్యలను తగ్గించుకొనే ప్రయత్నం చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: