ఇవి తీసుకుంటే కాలేయ సమస్య తప్పదు!

Purushottham Vinay
ఇక మీరు మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మాత్రం.. ఎలాంటి పదార్థాలు తినాలి ఇంకా ఎలాంటివి తినకూడదో ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మీ కాలేయానికి ఏ ఆహారం అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఏవి హాని కలిగించేవో కూడా ఖచ్చితంగా తెలుసుకోవలి. అతిగా మద్యం సేవించడం ఇంకా అలాగే స్థూలకాయం కారణంగా కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి మన కాలేయానికి చాలా ప్రమాదకరంగా మారే కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, పొరపాటున కూడా వీటిని తినకూడదు.ఎక్కువ చక్కెర కేవలం మీ దంతాలకు మాత్రమే కాదు, మీ కాలేయాన్ని కూడా బాగా దెబ్బతీస్తుంది. ఈ కాలేయం కొవ్వును తయారు చేయడానికి ఫ్రక్టోజ్ అనే చక్కెర రకాన్ని ఉపయోగిస్తుంది. అధిక మొత్తంలో శుద్ధి చేసిన చక్కెర ఇంకా అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ తీసుకోవడం కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ మాదిరిగానే చక్కెర కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.


అలాగే శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం. ఇక వాటిలో ఒకటి విటమిన్ ఏ. శరీరంలో విటమిన్ ఏ లోపాన్ని తాజా పండ్లు ఇంకా కూరగాయలతో తీర్చవచ్చు. విటమిన్ ఏ ఎరుపు, నారింజ, పసుపు రంగుల పండ్లు ఇంకా కూరగాయలలో అధిక మొత్తంలో లభిస్తుంది. కానీ, చాలా మంది విటమిన్ ఏ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకుంటారు. విటమిన్ ఏ సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఉంది.అలాగే ప్రొటీన్లు అధికంగా ఉండే ఎర్ర మాంసాన్ని జీర్ణం చేయడం మీ కాలేయానికి చాలా కష్టంగా మారుతంది.కాలేయం ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేయడం కూడా అంత సులభం కాదు. కాబట్టి, అదనపు ప్రోటీన్‌ల నిర్మాణం అనేది కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడు ఇంకా అలాగే మూత్రపిండాలకు హాని కలిగించే కొవ్వు కాలేయ వ్యాధులతో సహా ఎన్నో అనర్థాలకు కారణమవుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: