శబాష్ పెద్దాయన.. అందరికీ పెద్ద మెసేజ్ ఇచ్చావ్?

praveen
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి వివిధ రకాల సర్వే సంస్థలు నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలలో బయటపడుతున్న నివేదికలు చూసి ప్రతి ఒక్కరు నివ్వెరపోతున్నారు అని చెప్పాలి. నిజంగానే ప్రతి ఏడాది రోడ్డు ప్రమాదాల బారినపడి ఇంత మంది చనిపోతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత షాక్ అవుతున్నారు కానీ రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి అని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.

 ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని అటు పోలీసులు ఎంత మొత్తుకున్నా వాహనదారులు మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. నేటి రోజుల్లో ఎన్నో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చినా కూడా వాహనదారుల తీరులో మార్పు రావడం లేదనే చెప్పాలి. ఇలా అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సమయంలో ఇక్కడ ఒక పెద్దాయన మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు అని చెప్పాలి.  అతను నడుపుతుంది సైకిల్ అయినప్పటికీ హెల్మెట్ మాత్రం మర్చిపోవడం లేదు.

 పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం కు చెందిన రాయమల్లు గొర్రెల కాపరి.  ఇక ఇంటి నుంచి గొర్రెలమంద వద్దకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా అవసరాలు పడినప్పుడు బయటికి వెళ్లేందుకు సైకిల్ పై వెళుతూ ఉంటాడు. అయితే ఇలా సైకిల్ పై వెళ్తున్నప్పటికీ అతను మాత్రం హెల్మెట్ తప్పకుండా పెట్టుకుంటాడు. దాదాపు నాలుగేళ్ల కిందట రాయమల్లు కుమారుడు ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినప్పుడు వచ్చిన హెల్మెట్ ఇంట్లో ఉండడంతో ఇక అప్పటినుంచి క్రమం తప్పకుండా దాన్ని పట్టుకుని సైకిల్ పై వెళ్తున్నాడు. ఇటీవలి కాలంలో వాహనాలు నడుపుతున్న హెల్మెట్ పెట్టుకోని సమయంలో సైకిల్ పై కూడా హెల్మెట్ పెట్టుకుని ప్రాణం విలువ ఏంటో చెబుతూ ఈ పెద్దాయన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడని అంటున్నారు  నెటిజన్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: