లైఫ్ స్టైల్: రాత్రి పూట నిద్ర పట్టకపోతే .. వంటింటి చిట్కాలే బెస్ట్..!
ముఖ్యంగా ఒక్క రోజు సరిగ్గా నిద్రపోయాక పోయినా సరే మరుసటి రోజు ఆ ప్రభావం మన పై పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇక మెదడు ఆరోగ్యంగా పని చేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మంది డైటింగ్ పేరుతో ఎంత ఆకలిగా ఉన్నా సరే తక్కువ మోతాదులో మాత్రమే ఆహారం తీసుకుంటున్నారు. అలాంటి వారిలో నిద్ర సరిగ్గా పట్టకపోగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. సరిగ్గా తినకపోవడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎవరైనా సరే.. ఆయా సీజన్లను బట్టి ఆ సీజన్లో లభించే పండ్లను కడుపునిండా తిని నిద్ర పోవాలి . అంతే కాదు బెల్లం తినడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక పడుకునే రెండు గంటల ముందు కడుపునిండా తినాలి.. అలాగే పడుకునే గంట ముందే ఫోన్ , టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను చూడకుండా ఉండాలి.. ఇక అలసట వచ్చే వరకు ఏదైనా మంచి పుస్తకం చదవవచ్చు. అయినా కూడా నిద్రపట్టకపోతే మ్యూజిక్ వినడం.. మీకు నచ్చిన పని చేయడం.. ఇంట్రెస్టింగ్ గా వుండే కథలు వినడం లాంటివి చేయడం వల్ల నిద్ర తప్పకుండా పడుతుంది. పోషకాలు కలిగిన ఆహారాలను మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.