లైఫ్ స్టైల్: ఇలా చేస్తే కుండ నీటిని కూడా ఫ్రిజ్ వాటర్ లా చేయవచ్చు..!!
ఫ్రిజ్లో నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురవుతారని.. పైగా గొంతు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కుండ నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవు.. పైగా కుండ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల కుండలోని నీటిని తాగడం వల్ల చల్లగా అనిపించడమే కాదు ఆరోగ్యానికి కావలసిన పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే ఫ్రిడ్జ్ ని ఉపయోగించకుండా ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటి లాగా చల్లగా ఉండాలి అంటే.. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. మార్కెట్లో ముందుగా ఒక నీటి కుండ ను తీసుకొని దాని కింద మరొక ఒక కుండను సగానికి కట్ చేసి.. మట్టిని నింపి దాని పైన మనం ఉపయోగించే మంచి నీటి కుండ ను పెట్టాలి.
అలాగే మట్టి లోకి రాగి గింజలు లేదా మెంతి గింజలు ఆ మట్టిలో వేసి పైన కుండలో పెట్టి మట్టిలో నీటిని పోయాలి. అంతేకాదు నీటి కుండ చుట్టూ నీటిలో అద్దినా కాటన్ గుడ్డ కూడా చుట్టవచ్చు. ప్రతి అర గంటకు ఒకసారి ఈ గుడ్డ పైన నీటిని పోస్తూ అలాగే మట్టిలో కూడా నీటిని పోస్తూ ఉండాలి. ఇక రెండు మూడు రోజులకు మనం చల్లిన గింజలు కూడా మొలకలలా వస్తాయి. అంతేకాదు కుండలో నీరు కూడా చాలా చల్లగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది.