లైఫ్ స్టైల్ : ఎండలో వేడిచేసే నీటి ఉపయోగాలు తెలుసా..?
ఆయుర్వేదం అంటే సూర్యోదయం అని అంటే సూర్యకాంతి ద్వారా నీటిని శుద్ధి చేస్తారు అని పురాణాలలో కూడా లిఖించబడింది.. ఒక గాజు సీసా తీసుకుని అందులో నీటిని నింపి ఎండలో వేడి అయ్యేలా చేయాలి. అది వేడెక్కి..దాని శక్తిని తిరిగి పొందుతుంది.. ఇక సూర్యకాంతి నుంచి వచ్చి యు.వి కిరణాల వల్ల నీటిలో ఉండే సూక్ష్మజీవులు క్రమంగా తగ్గిపోతాయి..అంతే కాదు సూర్యకాంతి నీటి ద్వారా మీ శరీరంలో శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.. పైగా శరీరంలో ఉండే వాపులు కూడా తగ్గిపోతాయి.
ఎండలో వేడి చేసిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే నూతనోత్తేజం శరీరంలో పెరుగుతుంది. కణాలకు మీరు చేసిన నష్టాన్ని సరిచేయడం లో ఈ నీరు చాలా బాగా పనిచేస్తుంది.. ఇకపోతే సూర్యకాంతిలో వేడి చేసిన నీటిలో యాంటీ ఫంగల్ , యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని శుభ్రపరచడానికి అలాగే కంటి చూపును మెరుగు పరచడానికి సహాయపడుతుంది..
సూర్యరశ్మిలో వేడి చేసిన నీటిని తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. ఆకలిని ప్రేరేపించే శక్తిని కూడా మనకు కలిగిస్తుంది. నులి పురుగులను నశింప జేసి అల్సర్ , ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేసే శక్తి ఈ నీటికి ఉంది.. కోపం, ఆందోళన , ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తుంది.