లైఫ్ స్టైల్: వంటలలో అజినోమోటో అధికంగా వాడుతున్నారా..?
ఇకపోతే మనం వండే వంటలలో ఇది ఎక్కువ అయితే తిమ్మిరి, చెమటలు , వాంతులు, శరీర నొప్పులు, బలహీనత వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.. నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడంలో అజినోమోటో ఎక్కువ ప్రమాదకరం. నాడీ వ్యవస్థను ప్రభావితం చేయ డంతో పాటు నరాల పనితీరు దెబ్బతింటుంది అంతే కాదు మెదడు పనితీరు దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువ.. ఇందులో ఉండే గ్లుటామిక్ యాసిడ్ వల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ పనిచేయడం ఆగిపోతుంది. అంతేకాదు శరీరంలో అధిక స్థాయిలు మెదడును దెబ్బతీస్తాయి.
ఊబకాయం వచ్చే సమస్య కూడా ఉంటుంది.. ముఖ్యంగా గర్భధారణ లో ఎన్నో ప్రమాదాలను కలిగిస్తుంది.. అందుకే గర్భిణీ స్త్రీలు అజినోమోటో ఎక్కువగా ఉండే చైనీస్ ఫుడ్ తీసుకోకూడదని సలహా ఇస్తున్నారు. ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది . ఇది పిల్లల గుండె పై ప్రభావాన్ని చూపుతుంది. ఇక నిద్రలేమి, మైగ్రేన్ సమస్యలతో పాటు అధిక రక్తపోటు సమస్యలు కూడా తలెత్తుతాయి.. ఒక్కొక్కసారి గుండెపోటుకు కూడా దారితీస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా చైనీస్ ఫుడ్ కి అలవాటు పడి ఉంటే వెంటనే పూర్తిగా తగ్గించుకోండి.