లైఫ్ స్టైల్:ఇంటికి వాస్తు దోషాలు పోవాలంటే ఇలా చేయండి..?

Divya
 హిందువులు ఎక్కువగా వాస్తు సంప్రదాయాలనే నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత కూడా ఇస్తూ ఉంటారు. ఇల్లు నిర్మించేటప్పుడు తప్పనిసరిగా ఈ వాస్తును పాటిస్తూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల తమ ఇంట్లో కుటుంబంలో తీవ్రమైన సమస్యలు రావడంతోపాటు, ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక అంతే కాకుండా కుటుంబ కలహాలు, ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా ముందుకు సాగి పోకుండా ఉంటాయి.

అలా ఆ వాస్తు లేని ఇంట్లో ఉండటం వల్ల.. వారు మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అయితే ఈ వాస్తు దోషాలను పోగొట్టుకోవాలంటే కొంతమంది ఆ పూజలు.. ఈ పూజలు.. చేయమని చెబుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాస్తు దోషాలు పోవాలంటే.. ముఖ్యంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వెళ్లాలని వాస్తు పండితులు తెలియజేయడం జరుగుతోంది. ఇంటి వాస్తు సమస్యల వల్ల ఇబ్బంది పడే వారు శ్రీ కాళహస్తి కి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల వారికున్న ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అని వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది. శ్రీకాళహస్తి లో ఉన్న ఆలయం.. చాలా ప్రత్యేకమైనదట, అంతే కాకుండా ఇక్కడ ఉండే శివుడు చాలా ప్రత్యేకం అని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు. అంతే కాకుండా ఈ ఆలయంలో రాహు దోష నివారణ పూజలు చేసుకోవడం వల్ల వారికున్న దోషాలు కూడా పోతాయని భక్తుల నమ్మకం.

ఇక అక్కడి దేవాలయంలో శుక్రవారం రోజున నిమ్మ పండు ద్వారా దీపం వెలిగించినట్లు అయితే దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేయడం జరిగింది. పౌర్ణమి రోజున శివ దర్శనం చేసుకోవడం వల్ల, మంచి ఫలితం దక్కుతుందట. వాస్తు గాయత్రీ మంత్రాన్ని 27 సార్లు ప్రతిరోజు జపించినట్లు అయితే వాస్తు దోషం తొలగిపోయే అవకాశం ఉందట. ముఖ్యంగా గృహప్రవేశం చేసేటప్పుడు మంచి వాస్తును ఎంచుకుని చేరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: