ట్రోల్ వ‌ర్డ్ : పంది గుండె

RATNA KISHORE
ఆది సూక‌ర వేద‌వేద్యుడు (సూక‌రం అంటే పంది) అంటే వేదాల‌ను ర‌క్షించిన వ‌రాహ మూర్తి అని! అంటే మ‌న జీవితంలో మ‌న దేవుళ్ల అవ‌తారంలో ఎంత గొప్ప ప్ర‌శ‌స్తి ఉంది. కానీ మ‌నం మ‌నుషులం క‌దా ఏవేవో మాట్లాడుకుని ఒక‌రినొక‌రు కించ‌ప‌రుచుకుని ఉంటాం.. వేదాలను ర‌క్షించేవాడు మ‌నుషుల‌ను ర‌క్షించ‌లేడా? క‌నుక ఆది కూర్మం ఓ చోట ఆది వ‌రాహం మ‌రో చోట ఉంది.. వరాహం అన్న‌ది కొన్నింట పూజ‌నీయం కూడా కదా! ఇవాళ వాటిని దాటి ఆలోచిస్తే సైన్సు కు కూడా వ‌రాహం పూజ‌నీయ‌మే! వైజ్ఞానిక ఛాయ పెరుగుతున్న కొద్దీ మ‌నుషులకు అద‌న‌పు జీవిత కాలాల ప్ర‌సాదింపు అన్న‌ది సాధ్యం అవుతుంది. క‌నుక రోగం తేలాక నివారణ‌కు ఓ మార్గం కూడా సులువు అవుతోంది. జీవ విధానంలో ఓ చోట అవ‌తార మూర్తి మ‌రో చోట ఆక‌లి తీర్చే జీవి.. ఈ రెండూ విరుద్ధం కానీ ఆక‌లి తీర్చే వాడే క‌దా అవ‌తార మూర్తి అవుతాడు.. అణువంత ఉండి బ్ర‌హ్మాండం దాటి వ‌స్తాడు.. క‌నుక ఆక‌లి తీర్చే సంప్ర‌దాయాల‌ను మ‌నం కించ‌పర‌చ‌కూడ‌దు..ఆక‌లి క‌న్నీళ్లు తుడిచే అవ‌తార మూర్తులు ఇంకొంద‌రు ఈ స‌మాజానికి కావాలి.. వ‌స్తారు కూడా!
 


మ‌నిషి ఏం తినాలి ఎలా ఉండాలి అన్న‌వి ఎప్ప‌టిక‌ప్పుడు పెద్ద‌వాళ్లు అంతా మాట్లాడుతూ  ఉంటారు.ఆ విధంగా ఆధ్యాత్మిక వేత్త‌లూ మాట్లాడుతూ ఉంటారు.కానీ సైన్సు మాత్రం ఏం చేసినా నిరూపించి ఆరోగ్య ప‌రంగా ఏం కావాలి ఎలాంటి న‌డ‌వడి కావాలి అని చెబుతూ ఉంటుంది. సైన్సుకు సాత్వికం,భ‌యాన‌కం అన్న‌వి తెలియవా? తెలుసు కానీ వాటి నియంత్ర‌ణ‌కు ఏం చేయాలో ఇత‌రుల‌ను నొప్పించ‌క చెబుతుంది. ఆ విధంగా సైన్సు స‌ర్వ‌జ‌నామోదం పొంది ఉంది.. ఉంటుంది కూడా! కానీ మ‌న జీవితాల్లో కొన్ని మాట‌లు విని ఆగిపోతాం. కొంద‌రు మాట‌ల కార‌ణంగా అవ‌మానం పొందుతాం.


అవును! ఏం తినాలోజియ‌ర్ స్వామి చెప్ప‌క్క‌ర్లేదు..ఎవ‌రి విచ‌క్ష‌ణ‌కు అనుగుణంగా వారి ఆహారం ఉంటుంది..అమెరికాలో నిన్న‌టి వేళ ఓ అద్భుతం అయింది.. దానికీ స్వామి మాట‌ల‌కూ కాస్త పొంత‌న ఉంది అని మా విశ్లేష‌కులు నాంచార‌య్య అంటున్నారు.. పంది గుండె మ‌నిషికి పెట్ట‌డం కార‌ణంగా ఆయుః ప్ర‌మాణాలు పెర‌గ‌డమే కాదు జీవావ‌ర‌ణంలో కొన్ని పోలిక‌ల కార‌ణంగా కీల‌క స‌మ‌స్యల నుంచి గ‌ట్టెక్క వ‌చ్చు అని కూడా అంటున్నారు. అంటే ఓ ప‌దేళ్లు మ‌నిషి అద‌నంగా బ‌తికేందుకు ఓ ఛాన్స్ నిన్న‌టి ప్ర‌యోగం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: