లైఫ్ స్టైల్: పెరటి లో ఉండాల్సిన ఔషధ మొక్కలు ఏంటో తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణను చాలా అందంగా తీర్చి దిద్దుకోవడానికి రకరకాల పూల మొక్కలతో ఇంటి ఆవరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలా మంది ఇంటి పెరటిలో పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఔషధ మొక్కలు కూడా ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వల్ల మంచి ప్రయోజనం కూడా మనకు లభిస్తుంది. ఔషధ మొక్కల వల్ల మనకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చు.
తులసి:
తులసిని దేవతగా పూజించడమే కాదు ఎన్నో ఔషధ గుణాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. తులసి ఆకులను ప్రతి రోజు తినడం వల్ల జ్వరం, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అన్నీ దూరం అవుతాయి. ఇక తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి ముందర పెంచుకుంటున్న విషయం తెలిసిందే.
మెంతి:
ఆకుకూరలలో అతి ముఖ్యమైన  ఆకు మెంతికూర.. పిల్లలకు కడుపు నొప్పిని తగ్గించడం,  పెద్దలకు శరీరంలో వేడిని తగ్గించడం వంటి సమస్యలను మెంతికూరతో నయం చేసుకోవచ్చు. అంతే కాదు కాలేయ సంబంధిత క్యాన్సర్, బాలింతలకు మేలు చేయడంతో పాటు మరెన్నో  ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు.
బాసిల్:
ఈ మొక్క ఆకులను వంటలలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల పిత్త ,వాత, కఫ ల చికిత్స శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాదు ఆకలి లేని వారికి ఈ ఆకులు తినడం వల్ల వెంటనే ఆకలి బాధను తీర్చడానికి ఉపయోగపడుతుంది.

కలబంద:
కలబంద ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం కలబంద జ్యూస్ తాగడం వల్ల గాయాలు , వాపులు వంటి సమస్యలు తొలగిపోవడంతో పాటు ఆకలి , మలబద్ధకం, జీవిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది..

వీటితోపాటు పుదీనా, బ్రహ్మి, నిమ్మ చెట్టు వంటి ఔషధ  మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: