ఎమోషనల్ ఎఫైర్స్.. ఎంత డేంజరో తెలుసా..!

MOHAN BABU
ఫిజికల్ రిలేషన్, ఎమోషనల్ ఇంటిమసీ.. ఈ రెండూ కూడా డేంజరే, కానీ ఎమోషనల్ ఎఫైర్  అనేది శృంగార బంధం కన్నా మరింత ప్రమాదకరమైనది. ఈ కనెక్షన్ లో సెక్స్ లేకపోయినా, సీక్రెట్ పార్ట్నర్ తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చేయడం ఒకటైతే, ఆ రిలేషన్ కొనసాగించేందుకు భాగస్వామి దగ్గర ఆ విషయాన్ని దాచడం మరో ఇబ్బందికరమైన సమస్య. ఈ పరిస్థితులను ఎదుర్కోవడంలో పడే ఆందోళనలే భాగస్వామిలో అనుమానం మొలకెత్తేందుకు కారణాలు అవుతుండగా.. ఈ భావోద్వేగాల ఆట ఎక్కడికి దారి తీస్తుంది?ఎవరిని ఎన్ని రకాలుగా బాధిస్తుంది? స్నేహం,ప్రేమ, కామం. దేనికదే ప్రత్యేకం. ఒక బంధం లోని ఎమోషన్, ఎఫెక్షన్ లో  కచ్చితంగా తేడాలుంటాయి.

అయితే ఏ బంధం నిలబడాలన్నా నమ్మకమే పునాది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే, భరించలేని బాధతో గుండె బరువెక్కుతుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి ఆ విషయంలో నమ్మకద్రోహం జరిగితే పరిస్థితులు తారుమారు అవుతాయి. అనేక కారణాల వల్ల ఎమోషనల్ ఎఫైర్స్ లో పాల్గొనవచ్చు. సాధారణంగా గమనిస్తే మాత్రం ఆత్మ గౌరవం లేదా అవతలి వ్యక్తి పట్ల గౌరవం లేకపోవడం వంటి విషయాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఉద్దేశపూర్వకంగా, అవకాశవాదంతో భాగస్వామి మోసం చేసే కారణాలు చాలా తక్కువే వాస్తవానికి 12 శాతం మంది పురుషులు మాత్రమే తమ భార్య కంటే ఆకర్షణీయంగా భావించే వారితో ఎమోషనల్ కలిగి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పార్ట్నర్ తో కాకుండా బయటి వ్యక్తితో ప్రేమలో ఉంటే తప్ప ఎమోషనల్ చీటింగ్ జరగదు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగానే ఎమోషనల్ ఎఫైర్ కొనసాగించినా,ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం మనకు తెలియకుండానే కాలక్రమేణా ఆ బంధంలో కూరుకుపోతాం.అందులోంచి బయట పడలేక బావోద్వేగ సంబంధం మరింత బలపడుతుంది. భాగస్వామి వేరే వ్యక్తి నుంచి మంచి కంఫర్ట్ ఆశిస్తున్నట్లు అనిపిస్తే వారు ఎమోషనల్ ఎఫైర్ కలిగి ఉండే చాన్స్ ఉంది.

బహుశా అది లిమిట్స్ కూడా దాటవచ్చు. ఇందులో సెక్సువల్ అప్రోచ్ లేనప్పటికీ మీకు సంబంధం లేని వ్యక్తి వద్దకు తరచు వెళ్లడం సమస్యాత్మకంగా మారుతుంది. ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ మరింత పెరిగిపోయి, వ్యక్తిగత,ప్రైవేట్ వివరాలు షేర్ చేసుకోవడంతో పాటు ఎక్కువ సమయం గడపవచ్చు. ఇలాంటి బయటి సంబంధం గురించి సీక్రెట్ గా వ్యవహరిస్తున్నారంటే అది ఎమోషనల్ చీటింగ్ గా పరిగణించవచ్చు. కాబట్టి సదరు రిలేషన్స్ పై వారు రక్షణాత్మకంగా ఉంటారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: