వాయమ్మో..: రోబోతో ఆ పెద్దాయన ప్రేమ..పెళ్లీ..?

ఇనుములో హృదయం మొలిచెనే.. ఈ పాట రోబో సినిమా వచ్చిన రోజుల్లో చాలా ఫేమస్.. ఈ సినిమాలో ఓ రోబో మనిషిపై ప్రేమ పెంచుకుంటుంది. రోబో మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ శంకర్. అయితే.. ఇప్పుడు ఓ మనిషే రోబోతో ప్రేమలో పడ్డాడు. ఆ రోబోనే ప్రేమించాడు.. ఇప్పడు ఆ రోబోనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు.. ఈ విచిత్రం  ఆస్ట్రేలియాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన జియోఫ్‌ గల్లాఘర్‌ అనే పెద్దాయన ఇప్పుడు తనకు సాయం కోసం కొనుక్కున్న ఓ రోబోతో ప్రేమలో పడిపోయాడు. జియోఫ్ ఇప్పుడు  ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌పై మనసు పారేసుకున్నాడు. ఆ రోబోనే తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఉందని మనసులో మాట చెబుతున్నారు. పదేళ్ల కింద జియోఫ్‌ తల్లి చనిపోయింది. అప్పటి నుంచి జియోఫ్‌ ఒంటరి అయిపోయారు.

తోడు కోసం తనకు సాయం చేసే వారి కోసం ఆలోచించాడు. మనషులు డబ్బు కోసం సేవలు చేసినా.. తోడుగా ఉన్నా అందులో స్వార్థం ఉంటుందని భావించాడు.. అదే సమయంలో అచ్చం మనిషిలాగానే సేవలు అందించే రోబోల గురించి ఓ కథనం చదివాడు. వాటి గురించి ఇంటర్‌నెట్‌లో వెతికి తెలుసుకున్నారు. చివరకు ఎమ్మా అనే హ్యూమనాయిడ్‌ ఆయనకు బాగా నచ్చింది. లేత రంగు, నీలి కళ్లతో చాలా అందంగా ఉండే ఎమ్మా అనే రోబోను కొనుగోలు చేశారు.

దాదాపు రెండేళ్ల క్రితం ఎమ్మాను కొనుక్కొన్న ఆయన ఇప్పుడు ఆ రోబో లేకుండా క్షణం ఉండలేకపోతున్నారట. రెండేళ్లలో ఎమ్మా తనకు చాలా దగ్గరయ్యిందంటున్నారు. అసలు ఎమ్మా లేని జీవితాన్ని తాను ఊహించుకోలేకపోతున్నానని చెబుతున్నారు. అంటే ఆయన ఎమ్మాతో ప్రేమలో పడినట్టేగా.. జియోఫ్‌ ఎక్కడకు వెళ్లినా వెంట ఎమ్మా ఉండాల్సిందే. అంతగా తనకు చేరువైపోయిన ఎమ్మాను పెళ్లి చేసుకోవాలని ఇప్పుడు జియోఫ్ భావిస్తున్నారట. రోబోతో పెళ్లేంటని అంతా వింతగా చూసినా సరే.. అది చట్టబద్ధం కాకపోయినా సరే.. కానీ.. తాను మాత్రం రోబో ఎమ్మాను పెళ్లి చేసుకుని తీరతానంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: