మార్నింగ్ రాగా : ప్రేమ‌పూర్వ‌క అబ‌ద్ధం కాలం

RATNA KISHORE
ప్ర‌త్య‌యం అంటూ ఏమీ లేని కాలం
ప్ర‌త్యామ్నాయ కాలం
ప్ర‌తిక్షేప‌ణ కాలం
అను స్వ‌ర ధారి ఈ కాలం
అనుప‌మ ధోర‌ణి  ఈ కాలం
అని రాయ‌డం త‌ప్పు స‌ర్!
న‌వ్వుకుంటాను నేను...
రాస్తున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలే క‌నుక
వాటిలో  అనిర్వ‌చ‌నీయ‌త అన్న‌ది
లేన‌ప్పుడు ఇన్ని అవార్డులు ఎలా వ‌స్తాయ్ రా!
 


మురికిమ‌యం అయిన కాలం ద‌గ్గ‌ర
మంచి నీటి స‌ర‌స్సు నిర్మాణం చేస్తే
అవార్డు వ‌స్త‌దా?
 

పూర్వ విశేష‌ణ ధాతువు లేని కాలం
వివ‌ర్ణం అయిన కాలం
దేహా క‌ల‌యిక కాలం
నిర్జీవ కాలం
నిర్ణ‌యాత్మ‌కం
ఛిద్ర‌మ‌యిన అండం
ఛిద్రం కాని పిండం  
తొలి ద‌శ నిర్భీతి జీవం
సత్ప్ర‌వ‌ర్త‌న‌లో లేని వైనం

అన్నీ అన్నీ క‌లిసి పెద్ద నోరు
అని రాయాలి.. అని చ‌దివేను
నేర్పాడు ఆరుద్ర న‌వ్వుకున్నాను
నోరు కుట్టుకుని బ‌త‌కాలా?
మ‌ళ్లీ య‌వ్వ‌న ప్రాయాల‌ను అరువు అడిగి
ప్రేమ పూర్వ‌క విన్యాసాలో చేయాలా?

అబ‌ద్ధాన్ని విశ్వం చెంత నిలిపి నీ జీవితం నిజం..నీ చావు నిజం అని ఎవ్వ‌రు చెప్పినా అంగీకారం కాని ప‌ని. శ‌త్రు గుణ‌కం జీవితాన్ని ప‌రివ్యాప్తం చేస్తుంది. నిలువ‌రించాక గెలుపు ఒక‌టి ప్ర‌సాదిస్తుంది. క‌నుక స‌మాన శ‌త్రువు స‌మాన అబ‌ద్ధం స‌మాన దోషం నిర్వికార రూపం ఈ కాలం.........
వ‌స్తు విన్యాసం చెంత సుఖం..దేహ విన్యాసం చెంత దుఃఖం..దుఃఖం కాలం..దుఃఖ నాశ‌ని దైవం.. మ‌ళ్లీ ఈ కాలం ఒక‌రి పాదం ద‌గ్గ‌ర ఉంది. ఆ కాలాన్ని ఏమ‌ని రాశాను ఆంజనేయ ర‌క్ష పాదం మ‌హా పాదం అని రాశాను.. అయినా కాలానికి ఎన్ని పాదాలు ఎన్ని నో ళ్లు ఎన్ని క‌ళ్లు.. న‌వ్వుకున్నాను.. అనాట‌మిక్ నేచుర్ తెలియ‌కుండా ఉంటేనే మేలు.. ఆట‌వికం ఒక‌టి ఆనందంగా స్వీక‌ర్త అయి ఉంటుంది. దేహం ను విస్తృతం చేసే కాలాన్ని జ్ఞానం అడ్డు కుని తీరుతుందా? మ‌రి! కాల జ్ఞానం ఏంటి ?

మా స‌ర్ ఒక‌రు న‌వ్వుకున్నారు.. కాల‌మే జ్ఞానం కదా! క‌నుక విస్తృతం అయిన ఈ జ్ఞాన ప‌రంప‌ర‌కు అవ‌ధి లేదు.. అనంతానంత ధార‌ల్లో కాల‌మ‌నే జ్ఞానం ఎక్క‌డో నిక్షిప్తం ఉండి మ‌న‌ల్ని శాసించ‌డం జ‌ర‌గ‌ని ప‌ని.. వెన్నంటే ఉంటూ న‌డిపించే శ‌క్తికి ఓ చోద‌కంగా నిలిచి ఉంటుంది క‌దా! అలాంట‌ప్పుడు ఈ విస్మ‌యక‌ర ధోర‌ణి ఎందుకు? అవ‌ధిని నిర్ణ‌యించుకుని రాయ‌డంలో అవార్డు వ‌స్తుందా చెప్పండి! న‌వ్వుకుంటాను నేను.. క‌నుక అవ‌ధి ఎక్క‌డా లేదు.. ఆది నేను అనాది నేను అని జాలాది ప్ర‌క‌టించినా అది కూడా త ప్పే!  ఎవ‌రికి వారు చేసుకునే ప్ర‌క‌ట‌నల్లో విశ్వాసం ఉంటుంది త‌ప్ప నిరూప‌ణ ఉండదు.. క‌నుక విశ్వాసాన్ని మ‌నం గౌర‌వించి, ని రూప‌ణ‌లు వ‌దిలేస్తాం.

అనాథ శ‌వం అనాథ జీవితంతో పాటు అనాథ కాలం.. రాత్రి ముసుగేసుకుని పోయి ఎక్క‌డో దాక్కున్న కాలం.. శృంగార సంబంధం.. వాంఛా సంబంధం.. ఇంకా చెప్పాలంటే.. మ‌నం వ‌ద్ద‌నుకున్నా మ‌న జీవితంలో పరి ప‌రి వేద‌న‌ల‌కు  కాలం ఒక అప‌రిష్కృతం కావొ చ్చు.. కాక‌పోవ‌చ్చు.. తొలి సారి మ‌నిషి త‌నని తాను అన్వయించుకుని అన్వేషించుకుని ఎక్క‌డో ఓ ద‌గ్గ‌ర ఆగి ఉంటాడు.. అదే అత డి ఆరంభం కాలం లెక్కింపులో కావొచ్చు.. అస‌లు అగ‌ణితం (లెక్కింపులో లేని అన్ కౌంట‌బుల్ అన్ ప్రిడిక్ట‌బుల్) అన్న‌ది లేదు.

అన్నీ లెక్కిస్తూనే ఉంటాం.. ఏ త‌ల్లి గ‌ర్భంలో ప్రాణం శ్రీ‌రామ చుట్టుకుందో నీకు తెలుసా అని ప్ర‌శ్నించాడు ఆరుద్ర (ఆయ‌నను సెమీ పోయెట్ అని రాయాలి..ఎందుక‌ని అంటే అన్నీ రాసి కొన్నింటిని మాత్ర‌మే అర్థ‌వంతం చేసి వెళ్లాడ‌ని అనుకోవాలి) ఆ విధంగా త్వ మేవాహ‌మ్ అని చెప్పాలి.. లేదా చెప్ప‌కుండా కూడా ఉండాలి.

రాస్తూ పోతూ ఉంటే కాలంలో క‌రిగి కాలంలో మునిగి శ‌త్రు దుర్భేద్య‌త‌ను ప్రేమించాను. ఒంట‌రిగా ఉన్న కాలంలో ఒంట‌రిగా ఉన్న మ‌నిషి ఎన్ని ఏకాంతాల కౌగిలింత‌ల్లో ఉక్కిరి బిక్కిరో! మ‌నిషి ఆ వేళ ఊర మాస్ అనుకుంటాను. ప‌క్కా క్లాస్ అనుకుంటాను.. కా లం క్లాస్ మ‌రియు క్లాసిక్ కావొచ్చు..ఎపిక్ అవుతుందో లేదో తెలియ‌దు! కాలాన్ని వెలివేయ‌డం అంటే మ‌నిషి  త‌నని తాను ఉన్న చోట నుంచి ఓ అంత‌ర్థానాన్ని కోరుకోవ‌డం..ఆ విధంగా కూడా మ‌నిషి సాధించిన కాలం మ‌నిషి సాగించిన కాలం ఒక‌టి అడ్డుగా ఉంటుంది.. నాలో మ‌రియు మీలో మూర్ఖ‌త్వం ఎంత ఉంటే అంత విరుగుడు మీలో నాలో వెతుకుతూనే ఉండాలి. అస‌లు పెద్ద రైలు బండి లాంటి కాలానికి పొగ మేఘాల ఆలాప‌న‌ల చెంత ద‌రిద్ర‌గొట్టు న‌గ్న దేహాల చిత్తం ఆహ్వానించి రాత్రి క‌న్య‌క రాక్ష‌స విన్యాసంలో ఉండిపోతుంది. దేహాచ్ఛాద‌న‌లు కాలం క‌రిగించి, విశృంఖ‌ల తీరు విస్మ‌యం అని నిరూపించి వెళ్లిపోతుంది. అర్థం చెడిన చోటు కాలం అంత‌ర్థానం అయి ఉండదు. స‌వాళ్ల‌కు ప్రాతిపదిక అయి ఉంటుంది.
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: