లైఫ్ స్టైల్: డబ్బు నిలవాలంటే ఈ చెడు అలవాట్లకు దూరం కావాల్సిందే..?

Divya
సాధారణంగా ప్రతి చిన్నదానికి కూడా గట్టి గట్టిగా అరవడం.. అనవసరంగా ఎక్కడైనా సరే ఉమ్మివేయడం.. ఎక్కువసేపు నిద్రపోవడం లాంటి పనుల వల్ల ఇంట్లోకి త్వరగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది..అంతేకాదు ఈ నెగటివ్ ఎనర్జీ మీ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎంత కష్టపడినా.. ఎంత డబ్బు సంపాదించినా.. ఈ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించడం వల్ల వచ్చిన డబ్బు కూడా ఖర్చయిపోతుంది. అంతేకాదు పర్సులో కూడా డబ్బు ఖాళీ అవ్వడం ఖాయం.. ఎక్కువ డబ్బులు ఖర్చు కావడం వల్ల పేదవాడిగా మిగలడం.. మనసు కూడా అశాంతిగా అనిపించడం లాంటివి జరుగుతుంటాయి.

జ్యోతిష్య శాస్త్రం , వాస్తు శాస్త్రం ప్రకారం.. మీలో ఉండే కొన్ని చెడు అలవాట్లు వల్ల కూడా  మనుషులు ఎదురుగా మార్చే అవకాశాలు ఉంటాయి.. ముఖ్యంగా వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని చెడు అలవాట్లను మానుకుంటే తప్పకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి సకల సౌభాగ్యాలు కూడా చేరుతాయి. ఇకపోతే  ఇటువంటి చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.
ఇళ్లు ఎంతో శుభ్రంగా ఉంటే అంత త్వరగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అట.. ఒకవేళ అపరిశుభ్రంగా అనిపించినప్పుడు ధనలక్ష్మి ఒక్క నిమిషం కూడా ఉండదు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈశాన్య దిశ పరిశుభ్రంగా ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రాదట. ఇక ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేయడం.. చెత్తాచెదారం తీసివేయడం.. మురికిగా ఉంటే శుభ్రం చేయడం లాంటి పనులు చేయడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. అంతే కాదు డబ్బులు, నగలు విలువైన వస్తువులు ఉంచే అల్మరా వద్ద తప్పకుండా చీపురుని తీసివేయాలి. ఇంటిలో ఉండే పెద్ద వారిని ప్రతి ఒక్కరు గౌరవించడం, వారి మనసు, జ్ఞానం, బలాన్ని ,కీర్తిని పొందడానికి ప్రయత్నం చేయాలి.. కొన్ని కొన్ని పద్ధతులను పాటించడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి నిలుస్తుంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: