'ఇండేన్ గ్యాస్' కస్టమర్లు ఇది గమనించారా?

VAMSI
ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రజ లందరూ కూడా ఎక్కువగా గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని పెంచారు. గ్యాస్ యాజర్లు ఉత్తమమైన సేవలను పొందటం కొరకు గ్యాస్ సిలిండర్ల గురించి వచ్చే అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు  తెలుసుకుంటూ ఉండాలి. ఇక ఇపుడు వచ్చిన వార్త ఇండేన్ గ్యాస్ కంపెనీ సిలిండర్లకు సంబందించినది. మీరు కనుక ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అయినట్లయితే ఈ విషయాన్ని తెలుసుకోండి. రెగ్యులర్ గా గ్యాస్ ను బుక్ చేసుకునే వారు అయితే ఈ విషయం మీకు ఉపయోగపడేదే.
ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు డెలివరీ ఇచ్చే విషయంలో పలు జాగ్రత్తలను పాటిస్తోంది. బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్లు ఇళ్లకు జాగ్రత్తగా చేరేందుకు గాను ప్రత్యేక కోడింగ్ పద్ధతిని సిద్దం చేసింది. అదేమిటంటే..?? డి ఎ సి కోడ్ (డెలివరీ ప్రామాణీకరణ కోడ్) ద్వారా ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించింది ఇండియన్ ఆయిల్. అదేమిటంటే  వీరు ఇండేన్ గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసే సమయంలో.. ఈ డి ఎ సి కోడ్ అనేది SMS ద్వారా ఖాతాకు జత చేసినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది నాలుగంకెలను కలిగి ఉండేటటువంటి కోడ్.
ఇది... ఒక రకంగా OTP లాగా అన్నమాట. అనంతరం గ్యాస్ సిలిండర్ ఇంటికి డెలివరీ తీసుకొచ్చే డెలివరీ బాయ్ కి కనుక మీకు ముందుగా వచ్చిన DAC కోడ్ కనుక చెప్తే, అతడు మీకు సిలిండర్ ని అంద జేస్తాడు. ఈ కోడ్ వలన మీ పేరు మీద వేరెవ్వరు సిలిండర్ తీసుకునే అవకాశం ఉండదు. కాగా గ్యాస్ ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గ్యాస్ భారం నిరుపేదలపై భారీగా పడుతోంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: