వారెవా: రిఫీల్‌ చేయకుండా 70 ఏళ్లు రాసే పెన్ చూశారా..?

కత్తి కంటే కలం గొప్పదంటారు.. అది అక్షారాలా నిజమే.. అయితే ఆ కలాల్లోనూ చాలా రకాలు ఉంటాయి.. రూపాయి పెన్ను నుంచి.. వెయ్యి రూపాయల పెన్నుల వరకూ ఎన్నో రకాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో చాలా వరకూ బాల్ పాయింట్ పెన్నులే ఉంటాయి. ఇప్పుడు చాలా సంస్థలు తక్కువ ధరలో వాడి పారేసే రకాలు రూపొందిస్తున్నాయి.  పాతకాలపు ఇంకు పెన్నులు కూడా ఇంకా కొంత మంది వాడుతున్నారు. పాత కాలపు స్మృతులుగా ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఈ పెన్నులను తయారు చేస్తున్నాయి. అయితే.. పెన్ను ఎంత ధర ఉన్నా.. మహా అయితే.. ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు.

అంతే కాదు.. అది ఎలాంటి పెన్ అయినా సరే.. ఓ వారం రోజులు ఆగకుండా రాస్తే రీఫిల్ అయిపోతుంది. రీఫిల్ మార్చాల్సిందే.. ఇక ఇంక్‌ పెన్ అయితే... మూడు, నాలుగు రోజులకు ఒకసారి ఇంకు పోయాల్సిందే. మరి అసలు రీఫిల్ చేయాల్సిన అవసరమే లేని పెన్ను గురించి మీరు విన్నారా.. అసలు ఇంకు పోయాల్సిన అవసరమే లేని పెన్నులుంటాయని మీకు తెలుసా.. ఈ విషయాన్ని హైదరాబాదీలకు పరిచయం చేశారు ప్రముఖ చేతిరాత నిపుణులు మల్లికార్జునరావు.

ఓ చేతి రాత నిపుణుడిగా ఆయన అనేక పెన్నులు సేకరిస్తుంటారు. అందులో భాగంగానే తాను సేకరించిన స్పేస్ పెన్ గురించి ఆయన మీడియాకు వివరించారు. ఈ స్పెస్ పెన్‌ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రోజుకో వంద పేజీల చొప్పు.. 70 ఏళ్లపాటు రాసినా ఇంక్‌ అయిపోదు ఈ పెన్. అందుకే ఈ పెన్నులో మూత తప్ప ఏదీ విడదీయాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ దీన్ని స్పేస్‌ పెన్‌ అని ఎందుకు అంటారంటే.. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా రాస్తూనే ఉంటుంది. ఎలాంటి తలంపైన అయినా ఈ పెన్ రాస్తుందట.

అంతే కాదు.. మైనస్ 30 డిగ్రీల వాతావరణంలోనూ ఈ పెన్ రాస్తుంది..అలాగే 260 డిగ్రీల వేడి వద్ద కూడా ఈ పెన్ రాస్తుందట. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కదా.. మరి ధర కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ పెన్ మార్కెట్లో రూ. 15 వేల రూపాయల వరకూ ఉంటుందని మల్లికార్జురావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pen

సంబంధిత వార్తలు: