లైఫ్ స్టైల్: ఇలా నిద్రపోతే కచ్చితంగా ముఖంపై ముడతలు వస్తాయట..!!

frame లైఫ్ స్టైల్: ఇలా నిద్రపోతే కచ్చితంగా ముఖంపై ముడతలు వస్తాయట..!!

Divya
ఎంత అందంగా కనిపించినప్పటికీ ముఖం మీద ముడతలు వస్తే మాత్రం చూడడానికి చాలా ఇబ్బందికరంగా, వయసు అయిపోయిన వారి లాగా కనిపిస్తూ ఉంటాము. ముఖం మీద ముడతలు ఫైన్ లైన్స్ కనిపించకుండా ఉండాలనుకునేవారు ఎక్కువమంది బొటాక్స్ చేయించుకుంటూ వుంటారు. ఇక ఈ ప్రక్రియలోనే స్పెషల్ ఇంజక్షన్ లాగా ఈ బొటాక్స్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మజిల్స్ ని రిలాక్స్ చేసి ముడతలు రాకుండా ఈ బొటాక్స్ అనేది చూస్తుంది. ఈ మధ్య కాలంలో కొత్తగా ప్రివెంటివ్ బొటాక్స్ అనే పేరు బాగా వినిపిస్తోంది.

అయితే బొటాక్స్ కి ప్రివెంటివ్ బొటాక్స్ కి గల తేడా ఏమిటి అంటే.. బొటాక్స్ అనేది వచ్చిన తర్వాత చేయించుకుంటే ప్రివెంటివ్ బొటాక్స్ అనేది ముడతలు రాకముందే చేయించుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ ను స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం ఎప్పుడు అంటే.. ఎప్పుడైతే ముఖం మీద ఫైన్ లైన్స్ రావడం మొదలు పెడతాయి.. అప్పుడు మనం ఈ ప్రాసెస్ మొదలుపెట్టవచ్చు. అయితే వీటిని ఎలా గమనించాలి అంటే  ముందుగా కళ్ళ చుట్టూ మనకు కనబడతాయి.. 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇవి ముఖంమీద కనిపించడం మొదలు అవుతాయి.. కాబట్టి ప్రివెంటివ్ బొటాక్స్ చేయించుకుంటే చాలా మంచిది.

మీరు నిద్ర పోయేటప్పుడు వెల్లకిలా పడుకో డానికి అలవాటు చేసుకోండి. ఒకవేళ పక్కకి తిరిగి పడుకుంటే కచ్చితంగా మీరు ఏ వైపు ఎక్కువగా పడుకుంటారో ఆ బుగ్గ మీద లేదా ఆ  వైపు గడ్డం మీద కచ్చితంగా రింకిల్స్ లేదా ఫైన్ లైన్స్ వస్తాయి. ఒకవేళ మీరు బోర్లా  పడుకుంటే నుదిటి మీద వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వెల్లకిలా పడుకోడానికి ట్రై చేయండి. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కళ్ళు చిట్లించి చూడకుండా ఉండాలంటే, సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. సాల్మన్ చేపలు బాగా తినండి.కాబట్టి ముందే జాగ్రత్త పడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: