లైఫ్ స్టైల్ : ఈ పండ్లను భోజనానికి ముందు తినవచ్చా..?

Divya
సాధారణంగా ఇటీవల కాలంలో తాజాపండ్లు తినాలని వైద్యులు సూచిస్తూ ఉండడంతో , ఇక పనుల్లో పడి చాలామంది ఆహారం తింటే లేట్ అవుతుంది అని కారణంతోనే పండ్లను తింటూ ఉంటారు. ఇక ఆకలి వేసినప్పుడు ఆహారానికి బదులు ఈ పండ్లను తింటే ఏం జరుగుతుందో అనే విషయాలను తెలుసుకుందాం..
మనకంటే ఎక్కువగా ఆరోగ్య పరిశోధకులు ఎప్పుడు..? ఏ సమయంలో..? ఏం తినాలి..? అనే అంశంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. వీరు ఇటీవల ఒక కొత్త విషయాన్ని తెలిపారు. అయితే వారు ఇచ్చిన నివేదిక ప్రకారం ,మధ్యాహ్నం భోజనం చేసే సమయం ప్రతి రోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తి చేసేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఆహారం తినడానికి కుదరకపోతే, ఒక పండు తినమని చెబుతున్నారు.. సమయానికి భోజనం చేయకపోతే తలనొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి కాబట్టి వీటి నుంచి బయట పడాలి అంటే ఒక పండును తినమని అంటున్నారు..
ఇటీవల ఈ విషయాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దివేకర్ తెలిపారు .. ఇక వీరు మాత్రమే కాదు న్యూట్రిషనిస్ట్ అగర్వాల్ కూడా ఈ విషయాన్ని ఫాలో అవమని చెబుతోంది. ముఖ్యంగా పండ్లు తినడం వల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా అలాగే కొవ్వు పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. వీలైతే మధ్యాహ్నం సమయంలో ఒక ఆరెంజ్ తినమని సూచిస్తున్నారు. జ్యూస్ తాగాలి అనుకునేవారు అందులో చక్కెర వేసుకోకుండా, తాగమని సలహా ఇస్తున్నారు. ఒకవేళ చక్కెర వేసుకొని తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందట..
ప్రస్తుతం మార్కెట్లో దొరికే పైనాపిల్, బత్తాయి, అరటి వంటి సీజనల్  ఫ్రూట్స్ ను తీసుకొని రోజుకు ఒక పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుందని సూచిస్తున్నారు. ఈ పద్ధతులు పాటించడం వల్ల ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పద్ధతులు పాటించాలని వారు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: