కృష్ణాష్ఠమి : కృష్ణాష్టమి పండుగ విశిష్టత మీకు తెలుసా... ?

Suma Kallamadi
శ్రీకృష్ణుడి రూపం నల్లగా ఉన్నా.. మనసు మాత్రం  వెన్న పూసలా తెల్లగా ఉంటుంది. ఏ పరిస్థితులకు భయపడని కృష్ణుడు అన్నిట్లో విజయం సాధిస్తుంటాడు. భక్తులకు అండగా ఉంటూ వారందరికీ ఎంతో ప్రేమతో కోరికలను తీరుస్తుంటారు. నిజానికి కృష్ణభగవానుడు పేరు తలుచుకుంటేనే విజయం, అదృష్టం కలుగుతాయి. శ్రీకృష్ణుడు గురువారం రోజు అర్ధరాత్రి దేవకీదేవి వసుదేవుల దంపతులకు జన్మించాడు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం నుంచే భక్తులకు జ్ఞానోపదేశం చేసి గొప్ప దేవుడిగా కొలువుదీరాడు. భక్తుల హృదయాల లోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించాడు. అల్లరి లో శ్రీ కృష్ణుని మించిన దేవుడు ఎవరు లేరని నిరూపించారు. నల్లని అజ్ఞానాన్ని వదిలేయమని చెప్పడానికే కృష్ణుడు తెల్లని వెన్న తినేవాడు. అల్లరి బాగా చేసినప్పటికీ శ్రీకృష్ణుడు ఆడవారితో పరుషముగా మాట్లాడలేదు. కృష్ణతత్వంను చదివిన వారికి కృష్ణుడికి ఎంత గొప్పవాడో తెలుస్తుంది.
ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆగస్టు 30వ తేదీన జరుపుకుంటున్నాం. వైష్ణవ సాంప్రదాయంలో జన్మాష్టమిని 31న మంగళవారం రోజు జరుపుకుంటారు. స్మార్తులు తిధి ఆధారంగా శ్రీకృష్ణుడు పుట్టిన రోజును జరుపుకుంటారు. వైష్ణవులు మాత్రం నక్షత్రం ఆధారంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజును పరిగణిస్తారు. శ్రీ కృష్ణుడు 8వ సంతానంగా శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథిన కంసుడి కారాగారంలో పుట్టాడు. అందుకే ఈ రోజున శ్రీకృష్ణుని భక్తులందరూ స్నానమాచరించి మడి బట్టలు ధరిస్తారు. తమ గృహాలలోని పూజా గదిని శుభ్రం చేసుకుంటారు. ఇంటి గుమ్మాలను మామిడి ఆకులతో అలంకరించి.. గడపను పసుపుకుంకుమతో చక్కగా ముస్తాబు చేస్తారు.
కృష్ణాష్టమి రోజున భక్తులు పగటి పూట ఉపవాసం ఆచరిస్తారు. సాయంత్రం వేళ శ్రీకృష్ణుడిని పూజించి నైవేద్యం పెడతారు. శ్రావణ మాసంలో పుష్కలంగా దొరికే పండ్ల తో పాటు శ్రీ కృష్ణునికి అత్యంత ఇష్టమైన బెల్లం కలిపిన వెన్న , పెరుగు తదితర ఆహార పదార్థాలు నైవేద్యంగా పెడతారు. ఊయలలో శ్రీకృష్ణ విగ్రహాల్ని పెట్టి కీర్తనలు పాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: