మంచి పుస్తకం ఎక్కడ? రీడర్స్ ఫ్రెండ్లీ అంటే ?

RATNA KISHORE
మంచి పుస్తకం చదవక
కొనక ఆ పేజీలు తిరగేయక
చాలా కాలం అయిపోయింది
ఇప్పటికీ కొన్ని పుస్తకాలు
అవే అవే పేరు తెచ్చుకోవడంతో
కోపం మరియూ చిరాకు పుడుతున్నాయి
మనం మోయాల్సినవి ఏవీ లేవు
ఆ విధంగా మోయడం తప్పు
మరి! మంచి పుస్తకం  అంటే ..
ఎప్పటికీ స్మరణలో ఉండేది అని..దుఃఖానికి విరుగుడు ఇచ్చేది అని రాసుకోవాలి. మంచి పుస్తకానికి కొన్ని మాత్రమే లక్షణాలు ఉన్నాయి.అది గుండె గొంతుక నుంచి వచ్చే మాటలకు అర్థం చెప్పేదే అయి ఉండాలి.మహా ప్రస్థానం ఆ పనిచేసిందా? తెలియదు కానీ ఆ పుస్తకం నుంచి నేర్చుకోదగ్గది నేర్చుకోవడం చేయక తప్పని పని.రైటర్స్ రైటర్ అనే పదం దగ్గర ఆగిపోతాను.ఇది ఎవ్వరూ పట్టించుకోరేం అని కూడా అనుకుంటూ నవ్వుకుంటాను.అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంపుటిలో తన అక్షరాలకో నిర్వచనం ఇచ్చాడు కవి తిలక్.. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అని..కేవలం కావ్య భాషలో రాసి మెప్పించే ప్రయత్నం అయితే చేయలేదు కానీ సంస్కృత పదాల వినియోగం ఈ ఆధునిక వచనంలోనూ తార్లాడుతుంది. పుస్తకం నిండా జీవితమే నింపాడు ఒకడు..ఆయన పేరు గోపీచంద్ చలం కన్నా ఎక్కువ.. చలం ఇచ్చిన విషాదం వద్దు కానీ గోపీచంద్ వాస్తవికత  మాత్రం భలే ఉంటుంది. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని రాశాడుగా..

 
జీవన సహచరి చనిపోయాక మారిపోయాడు భరద్వాజ.. జీవితం అంచుల్లో తేలిన విషాదాన్ని నమ్ముకున్నా భరద్వాజ.. చూసిన జీవితాన్ని వడ గట్టాడు పతంజలి.. నా నుంచి నా వరకూ విస్తరించాడు కాశీభట్ల..రాసి చెడిన రైటర్లలో వీడూ ఒకడు అని నవ్వుకుం టాను. ఇంకా మార్కెట్లోకి కొత్త పుస్తకం ఏమయినా వచ్చిందా అని ఆరా తీస్తాను.వాటి వెనుక నేపథ్యం ఏంటన్నది తెలుసుకుంటే కాలానికి దాని మహిమకూ, అక్షరానికీ దాని విలువకూ కొత్తందాలు ఆపాదన అయితే తప్పక చేయగలం.. చెప్పానుగా  రైటర్స్ రైటర్ అన్న వాడెవ్వడూ లేడు కానీ రాసేవాళ్లంటే నాకు నిజంగానే గౌరవం.. నా చూపును విస్తృతం  చేయని వారంటే కిట్టదు కూడా! ఆహా! ఇంకా ఏవేవో! హ్యాపీ బుక్ లవర్స్ డే...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: