ఈ అలవాట్లు మానుకుంటే మీ మూత్రపిండాలు పదిలంగా ఉంటాయి.. !!

Suma Kallamadi
మనవుని  శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనది. మానవుని అవయవాల్లో మూత్రపిండాలు ఒక  ముఖ్యమైన భాగం అని చెప్పాలి. ఇవి శరీరాన్ని శుభ్రపరిచే ముఖ్యమైన అవయవాలు.ఈ మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, మీ శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. మూత్రపిండాలు  మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి.అలాగే మన  రక్తాన్ని కూడా  శుభ్రపరుస్తాయి.అలాగే శరీరంలోని ఖనిజాలు,  ముఖ్యమైన ఆమ్లాలను విసర్జిస్తాయి.మనం తెలియక చేసే కొన్ని తప్పులు వలన మూత్రపిండాలు అనేవి ఒక్కోసారి పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకనే మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మూత్రపిండాలు సవ్యంగా పని చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం.అందుకే ప్రతి ఒక్కరు కూడా తగినంత నీరు త్రాగాలి.  ఎందుకంటే మీరు తక్కువ నీరు తాగితే మూత్రపిండాలకు రక్తాన్ని శుభ్రం చేయడానికి సరిపడా ద్రవం అందుబాటులో ఉండదు.

మీ రక్తంలో ఉన్న ధూళి మీ శరీరంలోనే ఉంటుంది.అలా వ్యర్థ పదార్ధాలు శరీరంలో ఉంటే మీ మూత్రపిండాలకు మంచిది కాదు. అలాగే మూత్రవిసర్జన ఆపడం కూడా మంచి పద్ధతి కాదు.  మీరు క్రమం తప్పకుండా మూత్రవిసర్జన ఆపివేస్తే మీ మూత్రపిండాలకు ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వలన కిడ్నీలో రాళ్ళు తయారుచేసే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మూత్రపిండాలకు చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి మూత్రం వచ్చినప్పుడల్లా ఆగకండి.

అలాగే మీ రోజువారీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఉప్పు అధికంగా ఉండటం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది.అలాగే  మూత్రపిండానికి అదనపు భారం పడుతుంది.అలాగే  ఎక్కువ శీతల పానీయాలు తాగడం ద్వారా, మీ శరీరం యొక్క ప్రోటీన్ మీ మూత్రం ద్వారా విసర్జించబడుతుంది, అంటే మీ మూత్రపిండాలు ఆ సమయంలో సరిగా పనిచేయవు. అలాగే ప్రతి రోజు సమయానికి సరిపడా నిద్ర పోవాలి. మీరు సరిగ్గా నిద్రపోలేకపోతే ఇది  మీ మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.అలాగే మీ రోజు వారి ఆహార పదర్ధాలలో  పండ్లను ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: