యువత ప్రేమలో ఉన్నప్పుడు కేవలం అవి మాత్రమే అడుగుతారట ...!

Kothuru Ram Kumar

ప్రతి మనిషికి ఆపోజిట్ జెండర్ వారి పట్ల ఆకర్షణ ఉండడం సహజమైన చర్య. నిజానికి అది ప్రేమో, వ్యామోహము ఇంకా ఏదో వాళ్ళ ఓ పట్టాన ఓ కొలిక్కి రాలేరు. అలా అని ఇంట్లో వారికి చెప్పుకోలేదు. ఇక మరి కొందరైతే ఎప్పుడు వారి పక్కన ఉండే స్నేహితులకు కూడా చెప్పుకోలేరు. ఇలా ఎవరికీ చెప్పుకోలేక అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే... ప్రేమలో ఉన్నప్పుడు తమ ఆపోజిట్ జెండర్ నుండి యుక్త వయసులో ఉన్నవారు ఎక్కువగా కౌగిలింతలు, ముద్దులు మాత్రమే ఆశ పడతారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది.

 

మామూలుగా యుక్త వయసులో ప్రేమ అంటే కచ్చితంగా శృంగారంలో పాల్గొనే అనే భావనలో చాలా మంది ఉండేవారు. అయితే ఆ ఆలోచనలను ఈ తరం యువత చెరిపి పడేసింది. ప్రేమలో ఉన్నప్పుడు కేవలం కౌగిలింతలు, ముద్దులు మాత్రమే అమ్మాయిల గానీ, అబ్బాయిలు గానీ ఇష్టపడతారని తెలిపారు. ఈ విషయంలో సర్వే పై తేలిన ఫలితాలు.

 

ఇక మరికొందరు లివ్ ఇన్ రిలేషన్ షిప్, ఫ్రెండ్షిప్, జోక్స్, శృంగారం, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ సర్వేలో ఆరా తీయగా శృంగారం సంబంధాల కంటే ఎక్కువగా కౌగలింతలు ముద్దులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అందులో కూడా అబ్బాయిలే శృంగారపరమైన సంబంధాలకు దూరంగా ఉంటున్నట్లు బయటపడింది. అయితే ఇంకో సంస్థ జరిపిన సర్వేలో దీనికి విరుద్ధంగా శృంగారంలో తొలి అనుభవం కోసం ఈ కాలం యువత కాస్త తొందర పడుతున్నట్లు తెలిసింది. యువత తొలిసారిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొంటారన్న విషయంపై వారు జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు లైంగిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ సర్వే బట్టబయలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: