సంసారంలో చిటపటలు సర్వసాధారణం. ఎన్నిసార్లు చెప్పినా తన మాట వినదని భార్యపై భర్తకు అసంతృప్తి ఉండొచ్చు. ఏదేమైనా తనను అస్సలు పట్టించుకోడని భర్తపై భార్యకు ఫిర్యాదు ఉండొచ్చు. ఇలాంటి చిన్న అసంతృప్తులే సంసారాల్లో విఘాతాలకు కారణమవుతుంటాయి. వీటిని అధిగమించేందుకు సింపుల్ సూత్రం.. సర్దుకుపోవడమే.
చిన్న చిన్న కారణాలే అపోహలకు కారణమవుతుంటాయి. అయితే సర్దుబాటు ఒక్కటి ఉంటే చాలు.. ఆ సంసారం పచ్చగా ఉండటానికి.. కలిసుండటానికి ఆ ఒక్క కారణం చాలు. బంధం బలంగా ఉండాలంటే ఎదుటివ్యక్తి కోణంలో ఆలోచించగలగాలి. అతడు ఎంత కష్టపడుతున్నాడు... మాట జారడానికి కారణాలేంటీ ఇలా మీకు మీరే విశ్లేషించుకోవాలి. చాలా మంది చనువు ఉంది కదానీ.. ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించాలని చూస్తారు.
కొన్ని సార్లు భార్యాభర్తల్లో ఒకరు సినిమాకు పోదామంటారు... ఇంకొకరు పార్కుకు పోదామంటారు. రెండింటిలో ఏ ఒక్కటి జరగకపోయినా ఎవరో ఒకరి అభిమతం ఓడినట్టే. ఇద్దరూ గెలవాలంటే ఒకదాని తరువాత మరొకదానికి వెళ్లాలనే ధోరణిలో వ్యవహరించాలి. నా మాటే నెగ్గాలనే పంతం పనికిరాదు.
మరింత సమాచారం తెలుసుకోండి: