నాజుకైన నడుము కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే ఇలా ఫాలో అయిపోండి...!
ఆడవారికి చూడడానికి అందం ఎంత అవసరమో నాజుకైన నడుము కూడా వారికి అంతే ముఖ్యం. అందుకేనెమో నడుము గురించి కవులు, రచయితలు రకరకాల పూలు, పక్షులతో వారు పోలుస్తుంటారు. అయితే అందమైన నడుము అనేది ఎప్పుడూ సన్నగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే నడము వైపుకు రెండు పక్కలా కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటే చూసే వారికే కాదు, మనకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వండి.
ముందుగా ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఈ కొవ్వు పెరగడానికి మీ ఆహారపు అలవాట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చిరు తిళ్లు తినే వారికి, చల్లని కూల్ డ్రింక్స్ తాగేవారికి ఇలాంటి సమస్య చాలా ఎక్కువగా ఎదురవుతుంది. అందమైన నడుము కావాలంటే ఆ భాగంలో కొవ్వును బాగా కరిగించాలంటే క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయాలి. మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్, 3 సెట్ల పాటు రోజూ చేయాలి. ఇలా చేస్తే కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది. అలాగే నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత మేరకు వెనక్కి చేయాలి. అలాగే రెండో కాలితోనూ వీలైనంత ఎక్కువగా వెనక్కి చేయాలి. ఇలా ఒక్కో కాలితో 20 సార్లు రిపీట్ చేస్తూ చేయాలి. ఇలా మొత్తం మూడు సార్లు చేయాలి. ఇలా మీరు నిరంతరం చేయడం వల్ల మీ కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది.
ఇది ఇలా ఉండగా ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాదు ఆడవారి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగేలా చేస్తుంది. అయితే దీనిని పరిమితంగా తీసుకోవాలి. అలాగే హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మీ శరీర బరువుని తగ్గించుకుని మీ నడుము మడతలను కాస్త పెంచుకోవచ్చు. అలాగే బాదం పప్పును ప్రతిరోజూ తింటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా ఇవి కరిగిస్తాయి. అంతేకాదు మీ శరీర బరువును చాలా మేరకు తగ్గిస్తుంది. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కరిగిస్తాయి. అయితే ఈ బాదం పప్పులను ప్రతిరోజూ మీరు నిద్రించే సమయంలో వాటిని నీటిలో నానబెట్టి, తర్వాత రోజు ఉదయం నిద్రలేచి ఫ్రెషప్ తర్వాత బాదం పప్పుపై ఉన్న పొట్టు తీసి తినాలి.