వారు.. గుడ్డులోని పచ్చసొన తినకపోవడమే మంచిదా..!!

Divya
కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.. కరోనా సమయం నుంచి ఎక్కువగా వైద్యులు కూడా కోడిగుడ్లను తినమని సలహా ఇస్తూ ఉన్నారు. చాలా మంది ఎక్కువగా వీటిని అల్పాహారంగా కూడా తింటూ ఉన్నారు. ఇదే సమయంలో ఫిట్నెస్ విషయంపై ఎక్కువగా మక్కువ చుపెవారు ప్రోటీన్ గా కూడా ఇవి ఉపయోగపడతాయి. మొత్తానికి గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కండరాల అభివృద్ధి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడేందుకు కూడా సహాయపడుతూ ఉంటుంది.

అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి గుడ్లు తినడం మంచిదేనా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.. నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజు కూడా రెండు నుంచి మూడు గుడ్లను తీసుకోవాలట ఆరోగ్యంగా ఉన్నవారు వారంలో అయితే ఏడు నుంచీ పది గుడ్లు తీసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్ వర్కౌట్ చేసేవాళ్లు ప్రోటీన్స్ ఎక్కువగా రోజు గుడ్లు తినేవారు గుడ్డులోని తెల్లబాగాన్ని మాత్రమే తినాలి అంతేకాకుండా గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు తినాలి అంతే కాకుండా గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు రెండు గుడ్లు కంటే ఎక్కువ తినకూడదని వైద్యులు సూచిస్తూ ఉన్నారు.

గుడ్డుల ఎక్కువగా కొలెస్ట్రాలను ప్రోత్సహిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని తినకపోవడం చాలా మంచిది ఒకవేళ తప్పక తినాల్సి వస్తే కోడిగుడ్డు లోపల పసుపు భాగాన్ని తీసివేసి తినాలి పసుపు భాగంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి ఇవి హైబీపీ ఉన్నవారికి చాలా ప్రమాదాన్ని కలిగించేలా చేస్తాయి. మధుమేహ కలవారు మాత్రం వీటిని తినాలంటే వైద్యులను అడిగిన తర్వాతే తీసుకోవడం చాలా మంచిది. గుడ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని పెంచుతాయి దీనివల్ల పొట్టలో సమస్యలు కూడా పెరుగుతాయట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: