లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే కలిగే నష్టాలు ఇవే?

Purushottham Vinay
లెమన్ వాటర్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను నయం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ఖచ్చితంగా హాని కలుగుతుందని మీకు తెలుసా. వేసవి కాలంలో నిమ్మరసం ఎక్కువగా తాగితే ఖచ్చితంగా దాని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. లెమన్ వాటర్ వల్ల కలిగే నష్టాలను గురించి ఇప్పుడు తప్పక తెలుసుకోండి.లెమన్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఖచ్చితంగా గుండెల్లో మంట వస్తుంది. ఎందుకంటే ఈ వాటర్ ప్రోటీన్ బ్రేకింగ్ ఎంజైమ్‌పై పెప్సిన్‌ను సక్రియం చేస్తుంది. ఇంకా అదే సమయంలో, పెప్టిక్ అల్సర్ పరిస్థితి దాని అధిక వినియోగం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతుంది.లెమన్ వాటర్ ని తాగడం వల్ల  డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. నిజానికి నిమ్మరసం తాగినప్పుడు, అది మూత్రం ద్వారా శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఈ ప్రక్రియలో చాలా ఎలక్ట్రోలైట్లు, సోడియం వంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు వస్తాయి. అందువల్ల డీహైడ్రేషన్ సమస్య రావొచ్చు. నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల పొటాషియం లోపం ఏర్పడుతుంది.ఇంకా విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రక్తంలో ఐరన్ స్థాయిని విపరీతంగా పెంచుతుంది.


ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అంతర్గత అవయవాలకు హాని కలిగే అవకాశం ఉంది.ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఆక్సలేట్ కూడా ఉంటుంది. ఇంకా దీని అధిక వినియోగం కారణంగా.. ఇది స్ఫటికాల రూపంలో శరీరంలో ఈజీగా పేరుకుపోతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.ఈ లెమన్ వాటర్ ని ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఎందుకంటే నిమ్మకాయలో ఆమ్లత్వం ఉంటుంది. దీని కారణంగా ఇది ఖచ్చితంగా కూడా ఎముకలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అలాగే నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఈ నిమ్మకాయలో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.ఇంకా అలాగే మీకు టాన్సిల్ సమస్య ఉన్నట్లయితే నిమ్మకాయ వాటర్‌ని అస్సలు తీసుకోవద్దు. ఒక అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ నిమ్మకాయ వాటర్ ని ఎక్కువగా తాగితే అది గొంతు నొప్పికి కారణం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: