వేసవిలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..?

Purushottham Vinay
వేసవిలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఈ రోజుల్లో గుండె జబ్బులు చాలా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. చాలా మంది కూడా గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు.వేసవి కాలంలో ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల అనేది ఆరోగ్యంపై అనేక ప్రభావాలను చూపుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఖచ్చితంగా శరీరంపై ఒత్తిడిని పెంచుతాయి.అందువల్ల గుండె మరింత రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇది వేసవి కాలంలో ఖచ్చితంగా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వేసవి కాలంలో డీహైడ్రేషన్‌, హీట్‌ స్ట్రోక్‌ కారణంగా గుండె ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అధిక ఉప్పు తీసుకోవడం అనేది ఖచ్చితంగా గుండెపై ప్రభావం చూపుతుంది. ప్రతి రోజూ కూడా 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి. మీ ఆహారంలో తాజా పండ్లు ఇంకా కూరగాయలను ఎక్కువగా చేర్చుకోండి. కొన్ని ఫ్రూట్ సలాడ్స్‌ వంటివి క్రమంతప్పకుండా తినడం మర్చిపోవద్దు.


పుచ్చకాయ అనేది వేసవిలో ఎక్కువగా వినియోగించే సీజనల్ పండు. ఇందులో మొత్తం 92 శాతం నీరు ఉంటుంది.ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడే అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో వుండే నీటిశాతం కారణంగా, ఇది శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది, ఇంకా అలాగే గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇక స్ట్రాబెర్రీలు, గోజీ బెర్రీలు వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఇంకా అలాగే గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఇతర పదార్ధాల గొప్ప మూలాలు.ఈ మధ్య కాలంలో పోషకాహార నిపుణులలో బొప్పాయి పండు బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఇంకా అలాగే పాపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే ఆరోగ్యకరమైన గుండె, రక్త నాళాలను కూడా నిర్వహిస్తుంది.కాబట్టి ఖచ్చితంగా  ఈ ఎండాకాలంలో ఇవి తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా గుండె జబ్బులనేవి రాకుండా ఎక్కువ కాలం పాటు జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: