వేసవితాపం తీర్చే సగ్గుబియ్యం వల్ల ఇన్ని ఆరోగ్యప్రయోజనాలా..?

Divya
సాధారణంగా వేసవికాలంలో ఉండే ఎండలకు, డిహైడ్రేషన్ కాకుండా సగ్గుబియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.వీటిని కొన్ని ప్రాంతాలలో సాబుదాన అంటారు.ఇవి శరీరానికి చల్లదనం ఇవ్వడమే కాక, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సగ్గుబియ్యంలో ప్రోటీన్లు
ఎప్పుడు మన వంటగదిలో నిల్వ ఉండే వాటిల్లో సగ్గుబియ్యం ఒకటి.వీటిలో ప్రోటీన్లు పుష్కళంగా లభిస్తాయి. వీటిని తరుచు తీసుకోవడం వల్ల,కండరాలకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.మగవారు  వీటిని తీసుకోవడం వల్ల, వారిలో వీర్యకణాల వృద్ధికి కూడా చక్కగా ఉపయోగపడతాయి.ఇందులో పొటాషియం అధికంగా లభించడం వల్ల అది శరీరంలోని రక్తపోటుని తగ్గించడానికి సహాయపడుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి సగ్గుబియ్యం చాలా ఉపయోగపడతాయి. వీటిని రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల, ఇందులోని క్యాల్షియం శరీరంలో ఎముకలు గట్టిగా ఉండడానికి సహాయపడుతుంది. మరియు ఎదిగే చిన్నారులకు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలను చేసి పెట్టడం వల్ల వారి అరుగుదల శక్తికి ఎంతో మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.సగ్గుబియ్యంలో  ఐరన్, విటమిన్ కే పుష్కలంగా లభించడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో సహాయపడుతుంది.మరియు  మన గుండెకు కవాటాల మీద ఒత్తిడి పడకుండా చూడటంలో సగ్గుబియ్యంలో ఉన్న పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఎండలో వెళ్ళివచ్చిన వారికి తక్షణ శక్తి కావాలంటే, సగ్గుబియ్యాన్ని జావగా చేసుకుని తాగిస్తే వారికి తక్షణ శక్తి వస్తుంది. వాంతులు విరోచనాలు అయ్యేవారికి సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తీసుకుంటే ఎంతో మేలు అని చెబుతున్నారు పెద్దలు.
సగ్గుబియ్యంలో పోషకాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా  సహాయపడి,రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. పోషకాహార లోపంతో బాధపడేవారు సగ్గుబియ్యం ఆహారంగా తినడం వల్ల,పోషకాహార లోపం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం పాల నుండి తయారు చేస్తారు. ఇన్ని పోషకాలు ఉన్న సగ్గుబియ్యాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం చాలా ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: