కంటి చూపు బాగుండాలంటే ఇవి తినాలి?

Purushottham Vinay
ఈరోజుల్లో చాలా మందికి కూడా కంటి చూపు సరిగ్గా ఉండట్లేదు.అధిక రక్తపోటు కారణంగా నరాలు గట్టిపడి రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరగకపోవడం ఇంకా నరాలు చిట్లిపోవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఇంకా అలాగే హై స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఇన్ ప్లామేషన్ వచ్చి మాక్యులాకు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే షుగర్,అధిక బరువు వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే జన్యుపరంగా కూడా కొంతమందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ధూమపానం చెయ్యడం వల్ల కూడా రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతిని ఈ సమస్య తలెత్తవచ్చు. ఈ  సమస్యను తగ్గించడంలో మనకు పచ్చి ఆహార పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందుకు రోజుకు 400 నుండి 500 మిల్లీ గ్రాముల విటమిన్ సి శరీరానికి అందేలా ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ సమస్యకి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.ఇంకా అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి.


ఈ ఫ్యాటీ యాసిడ్లు ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా కంటి చూపును మెరుగుపరచడంలో  లూటిన్, జియోస్ఘాంథిన్ బాగా సహాయపడతాయి.ఇక ఇవి రోజుకు మన శరీరానికి 6 నుండి 12 మిల్లీ గ్రాముల మోతాదులో మనకు అవసరమవుతాయి. ఇవి పాలకూరలో, పిస్తా పప్పులో, పచ్చి బఠాణీల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మనం చాలా ఈజీగా ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. అలాగే గుమ్మడి గింజల పప్పులో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంకా అదే విధంగా రోజుకు రెండు పూటలా క్యారెట్ జ్యూస్ ను ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా  ఈ కంటి సమస్య నుండి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: