కాకరకాయ చేదు తగ్గాలంటే..?

Purushottham Vinay
కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాని దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరూ కూడా తినరు. కొంతమంది మాత్రం వీటితో రకరకాల కూరలగా చేసి తింటారు. అయితే కాకరకాయలను తినడం వల్ల మనం ఖచ్చితంగా చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు.ఎందుకంటే వీటిల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు ఇంకా వాపులను తగ్గిస్తాయి. అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. అందువల్ల ఈ కాకరకాయలను తింటే క్యాన్సర్లు రాకుండా కూడా చూసుకోవచ్చు.అందుకే వీటిని తినడం వల్ల విటమిన్ సి, ఇ, బి విటమిన్లు, ఫైబర్‌, పొటాషియం, ఐరన్‌ ఇంకా అలాగే కాల్షియం వంటి చాలా పోషకాలను పొందవచ్చు.కాకరకాయలను తినడం వల్ల ఇలా ఆరోగ్యానికి లాభాలు కలుగుతాయి. కాని చేదు వల్ల దీనిని తినరు. అయితే ఆ చేదుని పోగొట్టాలంటే ఇలా చెయ్యండి.ఇక కాకరకాయలను వండుకోవడానికి ముందు వాటిని ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని కొంచెం సేపు బాగా కలపాలి. 


ఇంకా ఇలా కలిపిన తరువాత 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే దాన్ని వదిలేయాలి. ఆ తరువాత నీళ్లను పోసి ఉప్పు మొత్తం పోయేలా మళ్లీ శుభ్రంగా కడగాలి. దీంతో చాలా వరకు చేదు ఈజీగా తగ్గుతుంది. ఇక చేదు తగ్గాలంటే కాకరకాయల్లో ఉండే గింజలను కూడా పూర్తిగా తీసేయాలి. వీటి వల్ల చేదు చాలా ఎక్కువవుతుంది. అందుకే కాకరకాయలను కట్ చేసే సమయంలోనే గింజలను తీసేస్తే మంచిది. దీంతో చేదును ఈజీగా తగ్గించుకోవచ్చు.అలాగే కాకరకాయలను కాస్త ఉడికించిన తరువాత వాటిల్లో ఉప్పు వేసి కడగాలి. ఇలా చేసినా కూడా చేదు ఈజీగా తగ్గుతుంది. ఆ తరువాత వాటితో కావల్సిన విధంగా మనం కూరను చేసుకోవచ్చు. అలాగే కాకరకాయల చేదు తగ్గాలంటే కాకరకాయలను వండుకోడానికి ముందు పెరుగులో ముక్కలు వేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత వండుకుంటే చేదు ఖచ్చితంగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: