చుండ్రుతో విసుగెత్తిపోయారా..ఈ ప్యాక్ లు వేయాల్సిందే..!

Divya
ఈ మధ్యకాలంలో తలలో చుండ్రు, దురదతో చిన్నా,పెద్ద తేడా లేకుండా చాలామంది బాధపడుతున్నారు. ముఖ్యంగా చుండ్రు అనేది ప్రతి సీజన్లోనూ అనేక మందిని ఇబ్బందిపెడుతోంది. దీనికి కారణాలుగా సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి,హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్,సీజనల్ మార్పులు అని రకరకాలుగా చెప్పుకోవచ్చు.ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్.దీనికి ఎన్నో రకాల కండిషనర్ లు,షాంపూలు వాడినా ప్రయోజనం లేక విసుగు చెందుతూ ఉంటారు. అలాంటివారు మనకు సహజ సిద్ధంగా దొరికే కొన్నిరకాల పదార్థాలతో ప్యాక్ లు వేసుకోవడం వల్ల చుండ్రు సమస్యను అదుపులోకి తెచ్చుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం..
వేపాకు :
చుండ్రుని కలిగించే ఫంగస్ తో పోరాడడానికి కావలసిన గుణాలు వేపలో పుష్కలంగా ఉన్నాయి. దీనికోసం గుప్పెడు వేపాకులు తీసుకొని బాగా శుభ్రం చేసి, అందులో ఒక స్పూన్ పెరుగు వేసి, పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి బాగా ఆరనివ్వాలి. అరగంట తర్వాత షాంపుతో స్నానం చేయడం వల్ల, చుండ్రు అదుపులోకి రావడమే కాక, ఇతర సమస్యలు కూడా తొలుగుతాయి.
 జామాకు..
జామాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జామాకు చుండ్రుని పోగొట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనికోసం మాకులను ఎండబెట్టి, పొడిగా చేసుకోవాలి. ఒక స్పూన్ జామాకు పొడిన తీసుకొని అందులో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శీకాకాయ పొడి కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకి పట్టించి బాగా మర్దన చేసి,ఆరిన తర్వాత శుభ్రం చేస్తే సరి. ఈ ప్యాక్ చుండ్రును పోగొట్టడమే కాక, తలలో రక్తప్రసరణ పెంచి జుట్టు ఆరోగ్యాంగా,దృఢంగా పెరగడానికి సహాయపడుతుంది.

మందారమాకు..
చుండ్రును వదిలించుకోవడానికి ఆయుర్వేద చికిత్సలో మందారమాకు చాలాబాగా  సహాయపడుతుంది. దీని కోసం గుప్పెడు మందారం ఆకులు తీసుకొని, అందులో పెరుగు వేసి, పేస్టుల చేసుకొని తలకు పట్టించి కాసేపు ఆరనివ్వాలి. దీనితో చుండ్రు తగ్గడమే కాక, జుట్టు మృదువుగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: