జలుబు, దగ్గు చిటికెలో తగ్గే చిట్కా?

Purushottham Vinay
జలుబు, దగ్గు వంటి సమస్యలు చాలా సాధారణంగా వస్తాయి. ఆ సమస్యల బారిన పడగానే చాలా మంది దగ్గు సిరప్ లను ఇంకా రకరకాల యాంటా బయాటిక్ మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఈ మందులను వాడినా వాడకపోయినా దగ్గు ఇంకా జలుబు వంటి సమస్యలు వారం నుండి పదిరోజుల్లో తగ్గుతాయి. అయితే ఈ మందుల కంటే మన ఇంట్లో దొరికే మసాలా దినుసులను వాడడం వల్ల చాలా త్వరగా వాటి నుండి ఉపశమనాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జలుబు ఇంకా దగ్గు వంటి సమస్యల బారిన  ఈ మసాలా దినుసులను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఇలాంటి సమస్యల బారిన పడినప్పుడు వేడి నీటిని తాగుతూ ఉండాలి.ఈ కాలంలో టీ, కాఫీలను తాగినట్టుగా మనం వేడి నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం అంతా కూడా ఈజీగా బయటకు వస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల శ్లేష్మం పలుచబడి చాలా ఈజీగా తొలగిపోతుంది.


ఇంకా అలాగే గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇలా వేడి నీటితో పాటు దగ్గు ఇంకా జలుబు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు కషాయాన్ని చేసి తాగడం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆ తరువాత అందులో 10 మిరియాలను కచ్చా పచ్చగా దంచి వాటిని వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని, అర టీ స్పూన్ పసుపును ఇంకా అలాగే గుప్పెడు తులసి ఆకులను వేసి నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించి వడకట్టుకుని కప్పులోకి తీసుకోవాలి. ఆ తరువాత అందులో రుచికి తగినంత తేనెను కలిపి వేడి వేడిగా ప్రతి రోజూ కాఫీలా తాగాలి. ఇలా ఉదయం ఒకసారి ఇంకా అలాగే సాయంత్రం ఒకసారి తాగడం వల్ల జలుబు ఇంకా దగ్గు నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: