సంక్రాతి పండుగకు కొట్టె గుమ్మడి కాయ వల్ల ఇన్ని ప్రయోజనాలా..!

Divya
మన హిందూ సాంప్రదాయ ప్రకారం గుమ్మడికాయను శుభకార్యాలలోనూ దిష్టి తీయడానికి మాత్రమే వాడుతుంటారు. అలా వాడిన గుమ్మడికాయను పడేయడమే తప్ప.. దానిని వంటల్లో వాడరు. కానీ దీనిని వంటల్లో వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు అలా చేయరు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో పుష్కలంగా దొరుకుతాయి.ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాక జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. ఎముకల దృఢత్వానికి..
 గుమ్మడికాయను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల దృఢత్వానికి కావాల్సిన కాల్షియం పుష్కలంగా అందుతుంది.దీనివల్ల కీళ్లనొప్పులు,మోకాళ్ళనొప్పులు, బోలు ఎముకల వ్యాధి వంటి రోగాలు దరి చేరవు.

2. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి..
 గుమ్మడికాయను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల, అందులో వున్న ఫైబర్ మన జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహయపడుతుంది.
 3. కంటిచూపు మెరుగుపరచడానికి..
 గుమ్మడికాయ లో బీటాకెరటిన్ అధికంగా ఉంటుంది. దీనిని మనం తిన్న తర్వాత, బీటా కెరోటిన్ లోపలికి వెళ్లి విటమిన్ ఏ గా మారుతుంది. ఇది మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4. ఇమ్యూనిటీపవర్ పెంచడానికి..
ఇందులో విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.
5. అధికబరువును తగ్గించడానికి..
రోజుకు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలను తీసుకోవడం వల్ల,ఇందులో వున్న అధిక పైబర్,యాంటీ ఒబెసిటీ గుణాలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాలను కరిగించి,అధిక బరువును నియంత్రణలోకి తెస్తుంది.
6.జుట్టు ఆరోగ్యానికి..
జుట్టు ఆరోగ్యానికి కావలసిన విటమిన్ ఇ గుమ్మడికాయ ముక్క లలో పుష్కలంగా దొరుకుతుంది. దీనికోసం ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలను తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె మరియు,తేనె కలిపి, మిక్సీ పట్టి, మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదల నుంచి బాగా అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల, జుట్టు దృఢంగా  మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: