నడుము నొప్పి: ఈజీగా తగ్గించే టిప్?

Purushottham Vinay
ఇక నడుము నొప్పిని ఈజీగా తగ్గించడంలో వంటగదిలో ఉండే వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ఎలిసిన్ అనే పదార్థం ఉంటుంది. నడుము నొప్పిని, వెన్ను నొప్పిని తగ్గించడంలో ఇది మనకు ఎంతో సహాయపడుతుంది.ఇక ఆయుర్వేదంలో కూడా వెల్లుల్లిని ఒక పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగిస్తారు. ఇంకా అలాగే నడుము నొప్పితో బాధపడే వారు ప్రతిరోజూ కూడా ఉదయం పూట పరగడుపున రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను ఖచ్చితంగా తినాలి. ఇలా చేయడం వల్ల నడుము నొప్పి చాలా ఈజీగా తగ్గుతుంది. అయితే కొందరూ వీటిని నేరుగా తినలేరు. ఇక అలాంటి వారు వెల్లుల్లి రెబ్బలను తేనెతో కలిపి తీసుకోవాలి. అయితే ఈ వెల్లుల్లిని తీసుకొని దానిని మెత్తగా దంచుకుని లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.5 నిమిషాల తరువాత  ఈ వెల్లుల్లిని తీసుకోవాలి.అయితే ఇలా వెల్లుల్లిని తినలేని వారు పది చుక్కల వెల్లుల్లి రసాన్ని పావు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కలుపుకుని తాగితే మంచిది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కూడా నడుము నొప్పి ఈజీగా తగ్గుతుంది. అలాగే నడుము నొప్పిని తగ్గించడంలో అల్లం కూడా మనకు ఎంతో సహాయపడుతుంది.


ఇక ప్రతిరోజూ కూడా ఒక కప్పు అల్లం టీని తాగడం వల్ల లేదా మన వంటల్లో అల్లాన్ని వాడడం వల్ల మనం నడుము నొప్పిని ఇంకా అలాగే వెన్ను నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ అల్లం టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక కప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్కను ముక్కలుగా చేసి వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత అందులో తేనెను ఇంకా అలాగే నిమ్మరసాన్ని కలపాలి. ఇలా చేయడం వల్ల ఇక అల్లం టీ తయారవుతుంది.దీనిని తాగడం వల్ల కూడా మనకు నడుము నొప్పి నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పితో బాధపడే వారు కొబ్బరి నూనెను వాడటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా గానుగలో ఆడించిన ముడి కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి నడుము నొప్పిని ఈజీగా తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెను తీసుకుని నొప్పి ఉన్న చోట రాసి ఒక 10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేయడం వల్ల నడుము నొప్పి నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: